మనకు ఏదైనా కష్టం వచ్చిన లేదా భాద వచ్చిన సంతోషం తో తబ్బి ఉబ్బిన పక్కనే స్నేహితుడు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అందుకే కాలేజ్ రోజులు అయి పోతున్నాయని తెలిస్తే, ఎక్కడ స్నేహితులు దూరమై పోతారని భాద పడుతుంటారు. కుటుంబ సభ్యులతో మహా అయితే రోజుకు కొన్ని గంటలు మాత్రమే స్పెండ్ చేస్తాము. కానీ ఎక్కవ టైం బయట స్నేహితులతోనే గడుపుతుంటాము. పెళ్లి చేసుకొని ఒక రక్తం తో పంచుకుని పుట్టిన అన్న దమ్ములు విడిపోతారేమో... కానీ స్నేహితుడు మాత్రం విడిపోడు. 

Related image

అచ్చం మనలా ఉండకపోయినా.. మన గురించి పూర్తిగా తెలిసిన వాడే ఫ్రెండ్. కొన్నిసార్లు మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన క్లోజ్‌ఫ్రెండ్‌ని చూస్తే చాలు. అవును.. ఫ్రెండ్ ఎప్పుడూ మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. పుట్టిన ప్రతి మనిషికీ అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లు, చుట్టాలు లాంటి బంధాలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ.. స్నేహితుడు మాత్రం పక్కా ఉంటాడు.

Image result for friend ship

మన జీవితంలో అమ్మానాన్నల పాత్ర ఎంత ముఖ్యమైందో, మన జీవితంతో ఎలా పెనవేసుకుని ఉంటుందో.. స్నేహితుడి పాత్ర కూడా అంతే. ఈ ప్రపంచంలో అందరికంటే పేదోడు ఎవరైనా ఉన్నారంటే.. ఖచ్చితంగా స్నేహితులు లేనివాళ్లే. అందుకే ప్రపంచమంతా నిత్యం ఎవరో ఒకరితో స్నేహం చేస్తూనే ఉంటుంది. స్నేహహస్తాలు చాచి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంది. స్నేహితులు లేని జీవితం జీవితమే కాదని చెప్పాలి. ఈ సృష్టిలో సహజంగా ఏర్పడే భందం ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: