హరిత హారం ఛాలెంజ్‌కు మంచి స్పందన లభిస్తోంది. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, సచిన్, లక్ష్మణ్, మహేశ్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి విసిరిన హరిత ఛాలెంజ్‌కు మెగాస్టార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. ఎన్టీవీ చౌదరి గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ... ఈరోజు మా ఇంటి పెరట్లో నేను మూడు మొక్కలు నాటడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.

నాకు ఛాలెంజ్ విసిరి, నాతో ఒక మంచి హరిత కార్యక్రమాన్ని చేయించినందుకు ఎన్టీవీ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ వీడియో ద్వారా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. చిరంజీవి మొక్కలు నాటిన వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఇంద్ర సినిమాలోని ఘల్లుఘల్లుమని.. సాంగ్ బ్యాక్‌గ్రౌండ్లో వస్తుండగా.. మెగాస్టార్ మొక్కలు నాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పర్యవరణ పరిరక్షణకు సంబంధించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 
ఆ ముగ్గురు...ఎవరంటే?
తన గార్డెన్లో మూడు మొక్కలను నాటారు. తర్వాత బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు చిరంజీవి హరిత సవాల్ విసిరారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మెగాస్టార్ చెప్పారు.  తాజాగా ఈ చిరంజీవి వీడియో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: