ఈవారం విడుదల కాబోతున్న సుశాంత్‌ రుహనీ శర్మ జంటగా నటించిన 'చిలసౌ' సక్సస్ కోసం సమంతా నాగాచైతన్యలు చాల కష్టపడుతూ ఎదో విధంగా ఆమూవీకి హిట్ టాక్ తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో సమంత నాగచైతన్య పై వేసిన సెటైర్ కు మీడియా వర్గాలు కూడ ఆశ్చర్యపోయాయి.   
చైతు గురించి బ్యాడ్‌‌గా విన్నాను
ఈమీడియా మీట్ లో సమంత గురించి నాగచైతన్య మాట్లాడుతూ తాను సమంతను పెళ్ళి చేసుకోవడానికి పడ్డ కష్టాలను వివరిస్తూ 7 సంవత్సరాలు ఆమె చుట్టూ తిరిగితే కాని సమంత తన లవ్ ప్రపోజల్ ను అంగీకరించలేదు అంటూ జోక్ చేసాడు. ఈ జోక్ కు తనదైన రీతిలో సమాధానం ఇస్తూ సమంత తాను అప్పట్లో చైతన్య గురించి ఇండస్ట్రీలో చాల బ్యాడ్ గా విన్నానని అందుకే అంత సమయం పట్టింది అంటూ రివర్స్ జోక్ వేసింది. 
చైతు అబద్దాలు చెబుతున్నాడు
అంతేకాదు చైతన్య గతంలో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు అందువల్లనే తన టోకెన్ వచ్చేసరికి 7 సంవత్సరాల సమయం పట్టింది అనేసరికి ఖంగారు పడ్డ చైతన్య సమంత చేపుతున్నవి అన్నీ అబద్దాలు అంటూ తనను తను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంతేకాదు గతంలో తాను ఎంతమంది వెంటపడినా ప్రస్తుతం సమంత మాత్రమే తన పర్మనెంట్ టోకెన్ అంటూ ఈ హాస్య సంభాషణకు చెక్ పెట్టాడు. 
పర్మినెంట్ టోకెన్ సమంతే...
ఇదే సందర్భంలో నాగచైతన్య ‘చి.ల.సౌ’ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీ కథ అంతా ఒక రాత్రిలో జరిగే కథ అని ఇలాంటి కథను జనం ఆదరిస్తారా అన్న భయం తనకు ఏర్పడినప్పుడు సమంత ఈమూవీలోని వెరైటీ పాయింట్ ను తన తండ్రి నాగార్జున దృష్టికి తీసుకువచ్చి తమ సొంత బ్యానర్ సినిమాగా ‘చి.ల.సౌ’ సినిమాను మార్చిన ఘనత సమంతది అంటూ ఆమె సమర్థత గురించి తెగ మెచ్చుకున్నాడు చైతన్య. ఈమధ్య కాలంలో సెన్సిబుల్ లవ్ స్తోరీలను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు అసలు పెళ్లి అంటే ఇష్టం లేని ఇద్దరి వ్యక్తుల మధ్య పుట్టిన ఈకొత్త లవ్ స్టోరీని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: