గత కొంతకాలంగా సినిమాలలో అవకాశాలు లేకపోయినా తన సంచలన ట్వీట్స్ తో మీడియాకు హాట్ టాపిక్ గా మారుతోంది పూనమ్ కౌర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో లో ఒక ప్రముఖ దర్శకుడు తనకు అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి మోసం చేశాడని పూనమ్ చేసిన ట్వీట్స్ తో ఒక ప్రముఖ దర్శకుడి పేరు బయటకు వచ్చింది. 
Poonam Kaur Latest Stills
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే ఈమెకు పవన్ ఆశిస్సులతోనే గతంలో ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం జరిగింది అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. అయితే ఈవిషయాలన్నీ పూనమ్ ఖండించినా లేటెస్ట్ గా పవన్ వీరాభిమానిగా పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా తనకు తానే ప్రచారం చేసుకునే నితిన్ నటిస్తున్న ‘శ్రీనివాసకళ్యాణం’ లో ఈమెకు ఒక ప్రముఖ పాత్ర లభించడం వెనుక ఎవరు ఉన్నారు అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.
poonam-kaur-latest-stills-1_0
ఇది చాలదు అన్నట్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న భారీ బడ్జెట్ సీరియల్ ‘స్వర్ణఖడ్గం’ లో పూనమ్ కు ప్రధాన పాత్ర దక్కడం వెనుక కొందరు సినీ ప్రముఖుల హస్తం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా ఒకేసారి ఈమెకు అవకాశాలు రావడంతో ఈమె వెనుక అజ్ఞాత వ్యక్తులు ఎవరు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 
poonam-kaur-latest-stills-3_0
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నడుస్తున్నది ఎన్నికల సీజన్ కాబట్టి ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి తన పై బురద పడకుండా పూనమ్ కు తెర వెనుక ఉండి అవకాశాలు ఇప్పిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏమైనా రాబోతున్న ఎన్నికల సీజన్ ఇప్పటికే ఫెడ్ అవుట్ అయిపోయిన పూనమ్ కు ఊహించని అదృష్టాన్ని ఇచ్చాయి అనుకోవాలి. ‘శ్రీనివాసకల్యాణం’ హిట్ అయితే ఈమె మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: