‘‘స్వరవేదిక” సంస్ధ  భారతీయ సంగీత చరిత్రలో మొదటి సారిగా ప్రముఖ తెలుగు వాగ్గేయకారుల రచనలతో పాటు, చరిత్రకందని తెలుగు వాగ్గేయకారుల రచనలతో “తెలుగు వాగ్గేయ వైభవం” అనే బృహత్తర కార్యక్రమం,ప్రముఖ గురువులు, సంగీతాచార్య సుప్రసిద్ధ కర్ణాటక సంగీత కారుడు డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యం లో, అమెరికాలోని మిలిపిటాస్ నగరం(కాలిఫోర్నియా), జైన్ మందిరం లో , జూలై 28 న అత్యంత వైభవంగా జరిగింది.


నాలుగు గంటలు పాటు సాగిన  ఈ కార్యక్రమంలో  అమెరికా లోని 10 రాష్ట్రాల నుండి వచ్చిన  40 మంది ప్రవాసాంధ్ర చిన్నారులు సుమారు 25 వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు. బే ఏరియా తెలుగు అసొసియేషన్, స్వరవేదిక సంస్ఠ సంయుక్తం గా  నిర్వహించిన ఈ కార్యక్రమనికి క్యూపర్టినో కౌన్సిల్ సభ్యులు మరియు ఫార్మర్ మేయర్. సవితా  వైద్యనాధన్ ముఖ్య అథిదిగా వచ్చారు.  వాగ్గేయ కారులపై  విశేషమైన  పరిశోధనలు  చేసిన  డా. వైజర్సు   రచించిన “అజ్ఞాత వాగ్గేయకారుల”  పుస్తకాన్ని విదుదల చేసారు.


ఈసందర్భంగా డా.బాలసుబ్రహ్మణ్యం  క్యూపర్టినో నగర ప్రశంసా పత్త్రాన్ని అందజేసారు.బే ఏరియా తెలుగు అసొసియేషన్ ,“స్వరవేదిక” సంస్ధ సంయుక్తం గా, డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం కి    “వాగ్గేయ వరప్రసాది” బిరుదుని ప్రదానం చేసారు.తెలుగు వాగ్గేయ వాజ్ఞ్మయా  పరివ్యాప్తికి ప్రపంచ నలుమూలల కార్యక్రమాలు నిర్వహిస్తామని స్వరవేదిక సంస్థ సభ్యులు ఈ సందర్బం గా తెలియజేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: