ఈ మద్య భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఎన్నో వార్తలు వస్తున్నాయి.  అయితే సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు సైతం ఈ బాధలు తప్పడం లేదు.  గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా విలన్ గా నటించే ఓ నటుడు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా విలన్ గా తయారయ్యాడు.  కన్నడ సినిమాల్లో నటించే  ధర్మేంద్ర అలియాస్ ధర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రతినాయక పాత్రలు పోషించే ధర్మపై నటి సునీత బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2017 మార్చి నుంచి ధర్మేంద్ర తన నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నట్టు ఆరోపించింది. అతడి డిమాండ్లను నెరవేర్చకుంటే తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అసలు విషయానికి వస్తే..మార్చి 1, 2017న  రాత్రి సునీతకు ఫోన్ చేసిన ధర్మ షూటింగ్ కోసం వెంటనే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు వెళ్లాలని సూచించాడు.   తన డ్రైవర్ నవీన్‌కు కారు ఇచ్చి సునీత ఇంటికి పంపాడు.  నవీన్ ఆమెను తీసుకెళ్లి షూటింగ్ సెట్ వద్ద వదిలిపెట్టాడు.
Image result for women harassment
షూటింగ్ సెట్స్ కి వచ్చిన తర్వాత ధర్మ షూటింగ్ ఆగిపోయిందని..తనతో భోజనానికి రావాల్సిందిగా కోరాడు.  అయితే ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెకు ఇవ్వడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది సునిత.   ఆమెకు మెలుకువ వచ్చిన తర్వాత అసభ్యకర వీడియో చూపించిన ధర్మ బ్లాక్ మెయిల్ చేశాడు. తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.  అంతే కాదు ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేస్తానని, ఆమె తల్లిదండ్రులకు దానిని చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సునీత మార్చి 2017 నుంచి మే 2018 వరకు మొత్తం రూ.14 లక్షలు చెల్లించుకుంది.

ధర్మ బెదిరింపులకు విసిగిపోయిన ఆమె భర్తతో కలిసి  వాదనకు దిగారు. తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  దాంతో తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్లు సునీత బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ధర్మపై బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసు పెట్టింది.    దాంతో ధర్మతోపాటు నవీన్ అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: