సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.


బాహుబలి శివగామి తర్వాత రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న సినిమా ఇదే అవడం విశేషం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్రేజీగా మారిన ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ టీజర్ గా శైలజా రెడ్డి అల్లుడు అలరించాడు. సినిమాలో చైతు లుక్ చాలా బాగుంది.


పెళ్లి తర్వాత చైతు నుండి వస్తున్న మొదటి సినిమా ఇదే అవడం విశేషం. ఇక ఈ సినిమాలో అను కూడా మరోసారి గ్లామర్ డాల్ గా కనిపించింది. రమ్యకృష్ణ మాత్రం సీరియస్ రోల్ లో కనిపించి అలరించనుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కచ్చితంగా మారుతి సినిమాల్లానే ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. 


ఆగష్టు 31న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ఇంప్రెస్ చేస్తుంది. చైతు కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: