ఈమధ్య కాలంలో క్రేజీ హీరోయిన్ రేజీనాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో కనీసం ఎదో ఒక సాహసం చేసి సోషల్ మీడియాలో అయినా హడావిడి చేద్దామని రేజీనా వేసుకున్న స్కెచ్ కి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. గత కొంతకాలంగా మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉండే యువతకు ‘కికి’ ఛాలెంజ్ పెద్ద కిక్ ను ఇస్తోంది. 
regina cassandra hot avatar in kiki dance
సిటీకి చివరిలో ఉన్న నిర్మానుష్య ప్రాంతాలలో రోడ్లపైకి వచ్చి యువత ఈ ‘కికి’ ఛాలెంజ్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ఛాలెంజ్ కి సంబంధించిన క్రేజ్ మొట్టమొదట ముంబాయిలో ప్రారంభం అయి ఇప్పుడు మన భాగ్యనగరానికి పాకింది. అయితే ‘కికి’ ఛాలెంజ్ పైన నగర పోలీసులు చాల సీరియస్‌ గా ఉన్నారు. ఎవరైనా కికి ఛాలెంజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికార్లు హెచ్చరిస్తున్నారు.
regina cassandra aces the kiki challenge
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ‘కికి’ ఛాలెంజ్ కి సంబంధించి క్రేజ్ ను అడ్డుకట్ట వేయడానికి పోలీసులు అనేక చోట్ల తనికీలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ‘కికి’ ఛాలెంజ్ విసిరిన సినీ నటి రెజీనాకు పోలీసులు క్లాస్ పీకారని తెలుస్తోంది. ఇలా ‘కికి’ ఛాలెంజ్ విసిరితే చర్యలు తప్పవని ఆమెకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్.

జూలై 29న రెజీనా యూత్ ‘కికి’ ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆవీడియో వైరల్ గా మారడంతో యూత్ తెగ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన అధికారులు ఈవిషయమై రేజీనా పై ఆగ్రహాన్ని వ్యక్త పరిచి గట్టి క్లాస్ పీకినట్లు సమాచారం..  



మరింత సమాచారం తెలుసుకోండి: