బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా ఇంటి సభ్యులు అందరు ఒకవైపు కౌశల్ ఒక్కడే మరోవైపు అన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకుండా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన శ్యామలా, నూతన్ నాయుడులను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించేలా నాని వారిని మళ్లీ రప్పించాడు.  


అయితే శ్యామాలా, నూతన్ నాయుడులు బిగ్ బాస్ లోకి వచ్చినా హౌజ్ లోకి మాత్రం వెళ్లలేదు. టైం చూసి బిగ్ బాస్ వాళ్లను పంపుతాడని చెప్పారు. ఇక ఆ టైం వచ్చింది. ఇంట్లోకి మొదట నూతన్ నాయుడు హౌజ్ లో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో నూతన్ నాయుడు బిగ్ బాస్ లోకి వచ్చాడు.


ఇక ఇన్నాళ్లు కౌశల్ ఒక్కడే ఉండి అందరితో వాదోపవాదాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు కౌశల్ కు సపోర్ట్ గా నూతన్ నాయుడు వచ్చాడు. కచ్చితంగా కౌశల్ కు హౌజ్ లో బలం పెరిగినట్టే. నూతన్ నాయుడు రాక హౌజ్ లో మిగతా కంటెస్టంట్స్ లో కూడా కాస వణుకు పుట్టేలా చేసిందని చెప్పొచ్చు. 


మరి కౌశల్, నూతన్ ల గేమ్ ఇంటి సభ్యులను ఎలా తికమక పెడుతుందో చూడాలి. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా కౌశల్ మంచి గేమ్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. మరి రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ లో పూజా, అమిత్, సామ్రాట్ లు ఈరోజు పోటీ పడనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: