కన్నడ హీరోయిన్ రష్మిక మందన చిలిపి చేష్టలకు తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం ఫిదా అవుతున్నారు. ఈమె తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ‘ఛలో’ హిట్ కావడం త్వరలో విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’ పై విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో ఒక విధంగా రష్మిక ప్రేమ వ్యవహారానికి సంబంధించిన బ్రేకప్ కు కారణమవుతోందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 
 గీత గోవిందంలో
కన్నడ సినిమా రంగంలో రష్మిక నటించిన కిరిక్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆమె క్రేజ్ ఒకేసారి పెరిగిపోయింది. ఇదే సినిమాలో ఆమెతో కలిసి నటించిన హీరో రక్షిత్ రష్మికతో ఈమూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రేమలో పడటం ఆతరువాత వారిద్దరూ పెద్దల అంగీకారంతో యంగేజ్ మెంట్ చేసుకోవడం కూడ జరిగిపోయింది. 
బ్రేక్ అప్ అంటూ
వాస్తవానికి ఈ ఏడాదిలోనే వీరిద్దరి పెళ్ళి జరగాలి అయితే ఈ పెళ్లి ఆలోచనలకు రష్మిక బ్రేక్ వేసినట్లు సమాచారం. దీనికి కారణం ‘గీత గోవిందం’ విడుదల కాకుండానే ఈమూవీలో ఆమె నటన గురించి తెలుసుకుని ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రష్మికకు విపరీతమైన ఆఫర్లు వస్తున్నట్లు టాక్. 
geetha-govindam-first-look
దీనితో కొన్ని సంవత్సరాలపాటు తన సినిమా కెరియర్ ను కొనసాగించి పెళ్లి ఆలోచనలకు స్వస్తి పలకాలని రష్మిక ఆలోచనలు చేస్తున్నట్లు కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈవార్తలను తెలుసుకుని ఇటీవల రక్షిత్ రష్మికతో ఫోన్ లో మాట్లాడడానికి ఇష్టపడటం లేదని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమె తనకు జరిగిన ఎంగేజ్ మెంట్ ని కూడా రష్మిక పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీనితో వీరిద్దరూ విడిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.ఒక విధంగా ఆలోచిస్తే వీరిద్దరి పెళ్ళి బ్రేకప్ కు విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ కారణం అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: