పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ నటి, గాయని రేష్మను దారుణంగా కాల్చి చంపేశారు.  ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కాదు స్వయంగా ఆమె భర్తే .  ఈ ఘటన ఖైబర్ పంఖ్తువా జిల్లా పరిధిలోని నౌషెరా ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనలతో పాక్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారే ఉలిక్కిపడింది. భర్త ఫైదాఖాన్‌తో గొడవ జరగడంతో రేష్మ పుట్టింట్లో ఉంటుంది. ఆమె భర్త ఫైదాఖాన్ అత్తగారింటికి వచ్చి ఇంటికి రావాల్సిందిగా రేష్మను కోరాడు. 
Image result for reshma pakistani singer actress shoot
ఎంత బ్రతిమిలాడినా తన భార్య రేష్మ వినకపోవడంతో సహనం కోల్పోయిన ఫైదాఖాన్ ఒక్కసారిగా తన వద్ద ఉన్న గన్ తో ఆమెను పాయింట్ బ్లాక్ నుంచి కాల్చి వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కాగా గత కొంత కాలంగా ఫైదా ఖాన్ విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు.  పెళ్లైన కొత్తలో కలిసి కాపురం చేసినా కొంత కాలం తర్వాత వారి మద్య మనస్పర్థలు రావడంతో విడి విడిగా ఉంటుంన్నారు.  అయితే ఈ మద్య తన భార్యతో కలిసి బతకాలని అనుకున్న ఫైదా ఖాన్ అత్తాగారింటిలో ఉంటున్న రేష్మ ఇంటికి వెళ్లారు.
singer killed by her husband
కానీ ఆమెను ఎంత ప్రాదేయ పడినా వినకపోవడం వల్లనే కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. రేష్మ సోదరుడు అతడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.విదేశాల్లో పని చేస్తోన్న ఫైదాఖాన్ ఇటీవలే పాక్ కు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: