నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన ‘శైలజా రెడ్డి’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యయేల్ లాంటి స్టార్ కాస్ట్ తో పాటు మారుతి లాంటి డైరక్టర్ ఈసినిమాకు పనిచేయడంతో ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది. 
Shailaja Reddy Alludu first look
ఈసినిమాను ఆగష్టు 31న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే లీకులు ఇస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఈమూవీని టార్గెట్ చేస్తూ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ ‘శైలజా రెడ్డి’ ని ఢి కొడుతూ ఆగష్టు 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

కేవలం 12 కోట్ల బడ్జెట్ తో తీసిన నాగశౌర్య ‘నర్తనశాల’ కు ఆమూవీకి పెట్టిన టైటిల్ రిత్యా క్రేజ్ ఏర్పడినా భారీ సినిమాగా మారిన ‘శైలజా రెడ్డి’ ని ‘నర్తనశాల’ ఏ ధైర్యంతో టార్గెట్ చేయబోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకుముందు నాగశౌర్యకు ‘ఛలో’ సినిమా విజయం ఇచ్చిన ధీమానో లేదా ఈ సినిమా మీద మితిమీరిన విశ్వాసమో నాగశౌర్య చేత ఇలాంటి సాహసం చేయిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
Sailaja Reddy Alludu Movie Teaser released Movie Unit
అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల బడ్జెట్ కంటే ఆసినిమాలలోని కంటెంట్ ను మాత్రమే చూస్తున్న నేపధ్యంలో నాగచైతన్య నాగశౌర్యల మధ్య జరగబోతున్న ఈవార్ లో ఏ నాగ విజయం సాధించబోతోంది అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఈరెండు సినిమాలలో ఏసినిమాకు మార్కులు తగ్గినా వీరిద్దరిలో ఒకరు ఘోరంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: