తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా సేన్  వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు హిట్ చిత్రాల్లో నటించింది శ్రియ.  సీనియర్ హీరోయిన్ అయినా ఈ అమ్మడు యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతు ఇప్పటికీ హీరోయిన్ గానే కొనసాగుతుంది.  


శ్రీయ ఇటీవలే తన రష్యన్ బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.  పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలు కమిట్ అవుతూ తన ప్రొఫెషన్ కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా రష్యాలో హాలీడే ఎంజాయ్ చేస్తున్న శ్రీయ తన ఇన్‍‌స్టాగ్రామ్ పేజీలో అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.   35 ఏళ్ల వయసులోనూ ఇంత హాట్ అండ్ సెక్సీగా తన ఫిజిక్ కొనసాగించడం ఒక శ్రీయకే చెల్లింది.


అంతే కాదు ఈ అమ్మడు వరుసగా సినీ ఛాన్స్ లు కొట్టేయడమే కాదు ప్రస్తుతం షూటింగ్ బిజీలో మునిగిపోయేందుకు సిద్దంగా ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన 2 సినిమాలు విడుదలవ్వగా నాలుగు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.తెలుగులో ఆమె 'ఆట నాదే వేటా నాదే' సినిమాతో పాటు, 'వీర భోగ వసంత రాయలు' సినిమాలో నటిస్తోంది. హిందీలో 'తడ్క' మూవీలో, తమిళంలో 'నరగాసూరన్' అనే చిత్రంలో శ్రీయ నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: