యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా వచ్చిన పిఎస్వి గరుడవేగ మళ్లీ ఆయన్ను హీరోగా నిలబెట్టింది. హీరోగా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి విలన్, సపోర్టింగ్ రోల్స్ కు సిద్ధమైన రాజశేఖర్ గరుడవేగతో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. మంచి కథ, దర్శకుడు పడితే రాజశేఖర్ కూడా హిట్ కొడతాడని అందరికి తెలిసేలా చేశాడు.


ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు రాజశేఖర్. మళ్లీ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లోనే సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా అది ముందుకు కదల్లేదు. ఇక ఇప్పుడు అ! సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.


ఈ సినిమా కూడా గరుడవేగ తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని అనుకున్నారట. ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ!లో కాజల్ లీడ్ రోల్ చేసింది. అందుకే ఆ చనువు కొద్ది కాజల్ ను అడిగాడట ప్రశాంత్ వర్మ. అయితే ఈ యువ దర్శకుడికి ఫ్యూజులు ఎగిరే ఆన్సర్ ఇచ్చిందట అమ్మడు.  


తన కెరియర్ కొన్నాళ్లు కొనసాగించే ఆలోచనలో ఉన్నానని ఇప్పుడు ఇలాంటి ఆఫర్స్ చేయలేనని చెప్పిందట. అంటే రాజశేక్జర్ తో చేస్తే ఇక అమ్మడి కెరియర్ అంతే అనుకుందా అందుకే ఇలాంటి కామెంట్ చేసిందా అని అంటున్నారు. హీరోయిన్ గా 50 సినిమాలు పూర్తి చేసిన కాజల్ చూస్తుంటే మరో 10 ఏళ్లు తిరుగు లేకుండా సినిమాలు చేసేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: