బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చుట్టూ వివాదాలు మొదలవుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు కర్నూలు జిల్లాలో ఉంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నివాసం ఉన్న ఇల్లు ఇప్పటికీ ఉంది.

 షూటింగ్ దశలోనే

తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రపై అంత భారీ స్థాయిలో సినిమా నిర్మిస్తూ కూడా తమని నామ మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఆరోపిస్తున్నారు. తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటం తమకు ఎంతో సంతోషం కలిగించే విషయమైనప్పటికీ, తమను నామమాత్రంగా కూడా గుర్తించడం లేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చిరంజీవిని, రాంచరణ్ ని కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాం అని దస్తగిరిరెడ్డి అన్నారు.

డిమాండ్ ఒక్కటే

దస్తగిరి రెడ్డి తండ్రి బాలిరెడ్డి. బాలిరెడ్డి తాతకు తాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దస్తగిరితో పాటు ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు అంతా చిరంజీవిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.  చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు ఆయన తమతో మాట్లాడలేదని అన్నారు. తమను పక్కన పెట్టి, వారి పని మాత్రం వారు చేసుకుంటూ పోతున్నారని వాపోయారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఉయ్యాలవాడ వంశీకులు మాట్లాడుతూ..తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్రిటిష్ వారితో గొడవ

ఇప్పటికైనా చిత్ర యూనిట్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.  కాగా, ఈ మద్య ‘సైరా’ కు కొత్త చిక్కులు వచ్చిన విషయం తెలసిందే. ‘రంగస్థలం’ కోసం వేసిన సెట్స్ లో ‘సైరా’ సీన్లు షూట్ చేస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులు వచ్చి ఆ సెట్స్ కూల్చి వేశారు.  ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: