ఈ మద్య స్టార్ హీరోల సినిమా ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఒక్కోసారి ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టినా..రాబట్టక పోయినా హీరోకి మాత్రం భారీ బడ్జెట్ సినిమాలో నటించారే పేరు మాత్రం వస్తుంది.  తెలుగు లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు..అదే స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.  ఇక శంకర్, రజినీ కాంత్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 సినిమా కూడా సుమారు నాలుగు వందల బడ్జెట్ తో తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 
Image result for mahabharata mohanlal
తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమైన పాత్రగా .. మహాభారతం కథావస్తువుగా ఒక సినిమాను నిర్మించనున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. బీఆర్ శెట్టి దీనిని 1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా నిర్మించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన 'రండా మూళమ్'అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు. అయితే భారతీయ చలన చిత్ర రంగంలో అంత భారీ బడ్జెట్ సినిమా ఇప్పటి వరకు రాలేదు.

మొదటి సారిగా భారీ బడ్జెట్ తో ‘మహాభారం’సినిమా నిర్మిస్తున్నారు.  మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ను ఉంచేసి, తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం 'ది మహాభారత' అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటి భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: