ఒక చారిత్రాత్మక సినిమాను తీసే సందర్భంలో ఆసినిమా విజయంకోసం కొన్ని కమర్షియల్ పద్ధతులు అనుసరించడం సహజం. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ కోసం ఇప్పుడు చరిత్రనే మార్చివేయాలని రామ్ చరణ్ చేస్తున్న ప్రయత్నాలు చరిత్రకారులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
ఛాలెంజ్ విసిరిమరీ
ప్రప్రధమ స్వాతంత్ర పోరాటం జరిగిన 1857 కాలంనాటి కథ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం. ఈ స్వాతంత్ర సమరోయోధుడి జీవితం పై ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అలనాటి పాలకులైన బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ నరసింహారెడ్డి పోరాటం చేయడంతో ఆపోరాటాన్ని అణిచివేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం అతడిని బంధించి అతడి తల నరికి కోటకు వేళ్ళాడ తీస్తుంది.
డిమాండ్ ఒక్కటే
ఎంతో ఉద్వేగంగా ఉండే నరసింహారెడ్డి జీవితానికి సంబంధించి తీస్తున్న ఈసినిమాలో క్లైమాక్స్ ను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. చరిత్రకారులు చెప్పే విధంగా ఉయ్యాలవాడ తల నరికి క్లైమాక్స్ లో చిరంజీవి పాత్ర ద్వారా చూపెడితే ఇలాంటి హార్డ్ క్లైమాక్స్ ను మెగా ఫ్యాన్స్ అంగీకరించరు అంటూ చరణ్ అభిప్రాయపడుతూ ఈమూవీ క్లైమాక్స్ ను మార్చమని చరణ్ దర్శకుడు సురేంద్ర రెడ్డి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఈ ఒత్తిడితో సురేంద్రరెడ్డి ఈమూవీ క్లైమాక్స్ కు సంబంధించి రెండురకాల ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
బ్రిటిష్ వారితో గొడవ
అందులో ఒకటి చిరంజీవిని ఉరి తీసే సీన్ ను చూపకుండా ఉరి తీశారని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించడం లేదంటే అసలు ఉరే తీయలేదని చెప్పి చరిత్రను వక్రీకరించడం.  రెండో ఆప్షన్ కు కనుక వోటేస్తే విమర్శకుల దాడి పెరిగిపోతుందని అందువల్ల చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా చూపించడం మంచిది అంటూ సురేంద్రరెడ్డి చరణ్ కు సద్దిచేపుతున్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: