ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి.  సినీ తారలే కాదు..క్రీడాకారులు, రాజకీయ నాయకులపై కూడా బయోపిక్ లు వస్తున్నాయి.  తెలుగు వచ్చిన మహానటి, బాలీవుడ్ లో వచ్చిన సంజు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  అంతే కాదు అంచనాలు మించి కలెక్షన్లు సాధించాయి.  ప్రస్తుతం తెలుగు లో ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లు షూటింగ్ జరుపుకుంటున్నాయి.  తాజాగా మహిళా క్రికెట్‌ క్రీడాకారిణిగా బహుళ ప్రాచుర్యం పొందిన మిథాలిరాజ్‌ గురించి క్రికెట్‌ క్రీడలో పరిచయం ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

Image result for mithali raj taapci

తమిళ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారిణి రాజస్థాన్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగింది. భారతదేశం తరఫున మహిళా క్రికెట్‌ క్రీడకు ప్రాతినిథ్యం వహించిన మిథాలిరాజ్‌ ఒన్‌డే క్రికెట్‌ క్రీడా పోటీల్లో అత్యధికంగా 114 పరుగులు సాధించింది. భారత క్రికెట్‌ క్రీడ కెప్టెన్‌ ఎంఎస్‌.ధోని బయోపిక్‌ తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కుస్తీ పోటీల నేపథ్యంలో అమీర్‌ఖాన్‌ నటించిన దంగల్‌ సంచలన విజయాన్ని నమోదుచేసుకుంది.

Image result for tapsee hot

అంతకు ముందు సల్మాన్‌ఖాన్, నటి ప్రియాంకచోప్రా ఇలా క్రీడల ఇతివృత్తంగా తెరకెక్కిన పలు సినిమాలో సెన్సేషన్ హిట్ అయ్యాయి.  తాజాగా ప్రస్తుతం మిథాలిరాజ్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. కాగా,  మిథాలిరాజ్‌ తన బయోపిక్‌ను వెండితెరకెక్కించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాకపోతే తన పాత్రలో నటి ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డట్టు సమాచారం. 

Image result for mithali raj taapci

కానీ ప్రియాంక ఇప్పుడు ఏ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపించడం లేదు.  మొన్నటి మొన్న సల్మాన్ ఖాన్ నటిస్తున్న భరత్ సినిమా లో నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.  దాంతో మిథిలీ రాజ్ పాత్ర కోసం తాప్సీని సంప్రదించినట్లు సమాచారం. నామ్‌ షబానా లాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో రాణించిన విషయం తెలిసిందే.  మిథాలిరాజ్‌ బయోపిక్‌లో నటించడం గురించి తాప్సీ స్పందిస్తూ క్రీడాకారిణి పాత్రలో నటించాలన్నది తన డ్రీమ్‌గా పేర్కొంది.  ఆ చిత్రం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను అని తాప్సీ అంది.


మరింత సమాచారం తెలుసుకోండి: