సినీ పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం..అక్కడ ఒక్కసారైనా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.  అయితే సినిమాలపై వ్యామోహం ఉన్నవారి బలహీనతలను చాలా మంది దళారులు క్యాష్ చేసుకుంటారు.  ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు తమకు తెలుసని..కొన్ని ఫేక్ ఫోటోలు సృష్టించిన ఎంతో మంది యువతీ యువకులను మోసం చేస్తుంటారు.  ఇలాంటి దృశ్యాలు మనం ఎన్నో చిత్రాల్లో చూస్తూనే ఉన్నాం.  ఈ మద్య చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయందని ఎంతో మంది నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు.  అయితే ఇలాంటి అకృత్యాలకు పాల్పపడేది..ఇండస్ట్రీలో చిన్న కేటగిరిలో ఉన్నవాళ్లే.  ఇక సినీ పరిశ్రమలో కాస్టింగ్ డైరెక్టర్లది కీలక పాత్ర.
Image result for casting couch
ఎంతో మంది నటీనటులు ఒక సినిమాకు అవసరం ఉంటుంది.. సగం పాత్రల్ని ఫిల్ చేసేది ఈ కాస్టింగ్ డైరెక్టర్లే.  అందుకే ఇలాంటి వారే ఎక్కువ శాతం ఛాన్స్ లు ఇప్పిస్తామని అమ్మాయిలను దారుణంగా మోసం చేస్తుంటారు.  చిన్న స్థాయి నటీనటుల నుంచి కమిషన్లు తీసుకోవడం.. అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం లాంటి పనులు చేస్తుంటారని కాస్టింగ్ డైరెక్టర్ల మీద ఆరోపణలున్నాయి.  ఈ మద్య శేఖర్ కమ్ముల కొత్త సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ అతను డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఇటీవలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Image result for casting couch
అసలు విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల వెంటనే అలర్ట్ అయి.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ మోసగాడి ఆట కట్టించాడు. ఈ సందర్భంగా కమ్ముల ఫేస్ బుక్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘సంజయ్ అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్ పేరుతో ప్రకటనలు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. బాధితుల్లో ఒకరైన ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మా ఆఫీస్ కి వచ్చి ఈ విషయాన్ని మాకు తెలియజేశాడు. వెంటనే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు నేను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను.

ఒక వారంలోనే ఈ మోసగాడిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మకండి. నిజానికి ఏదైనా పాత్రకు ఎంపికైతే మేమే డబ్బులిస్తాం. నా సినిమాలకు సబంధించి నటీనటుల ఎంపికను నేను.. నా డైరెక్షన్ టీమే చూసుకుంటాం. మా నుంచి కాల్ వస్తేనే నమ్మండి. ఇంకెవరు మోసం చేయాలని చూసినా జాగ్రత్త’’ అని కమ్ముల స్పష్టం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: