తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ తనయుడు నందమూని బాలకృష్ణ నటిస్తున్నారు.  తాజాగా ఎన్టీఆర్  బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. . పక్కా ప్లానింగ్ తో దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ .. విద్యాబాలన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన ఆయన, తదుపరి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు.  మొదటి నుంచి అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రంలో రానా ఎంట్రీ సిద్దమైంది.

చారిత్రాత్మకమైన `ఎన్టీఆర్` బయోపిక్ లో కీలకమైన బాబు పాత్ర చేయాల్సిందే అని రానాని దర్శకుడు క్రిష్ పట్టుబట్టడంతో ఆయన ఓకే చెప్పేశారు. ఇటీవలే రానాపై టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్రబాబు మేనరిజమ్స్ తో పాటు - ఆయనలా గెటప్ వేసుకొని రిహార్సల్స్ చేశాడట రానా.  ఎన్టీఆర్ తో సాన్నిహిత్యానికి సంబందించినవీ అలాగే  రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబానికి సంబంధించిన సన్నివేశాల్లో రానా కనిపించబోతున్నాడు.

చంద్రబాబు  మంత్రి అయ్యాకే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకొన్నారు. అందుకే పెళ్లి నేపథ్యంలో సన్నివేశాల్ని కాస్త భారీగానే తీయబోతున్నారట.  చంద్రబాబు  మంత్రి అయ్యాకే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకొన్నారు. అందుకే పెళ్లి నేపథ్యంలో సన్నివేశాల్ని కాస్త భారీగానే తీయబోతున్నారట. అయితే అప్పటివాతావరణాన్ని ప్రతిబింబించేలాగే ఆ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా రానా చంద్రబాబు నాయుడు మేనరిజమ్స్ పై దృష్టిపెట్టి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: