టాలీవుడ్ లో ఇప్పుడు తమిళ హీరోలు బాగానే రాణిస్తున్నారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో రజినీ, కమల్ తర్వాత ఆ స్థానంలో అజిత్, విజయ్, సూర్యలకు మంచి క్రేజ్ దక్కించుకున్నారు.  అంతే కాదు బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ, ఊపిరి సినిమాతో కార్తి కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  ఇక తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది అజిత్, విజయ్ లకు మాత్రమే. 
Image result for vivegam movie
అయితే అజిత్ నటించే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అజిత్ ఎంతో సహజసిద్దంగా నటిస్తుంటారు..తెల్లగా నెరసిన జుట్టుతోనే ఈ మద్య సినిమాల్లో నటిస్తున్నారు.  యాక్షన్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో తల అజిత్ నటించిన సినిమా ‘వివేగం’. అయితే ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేక పోయినా..అజిత్ స్టామినా ఏంటో చూపించింది.  ఈచిత్రాన్ని తెలుగులో వివేకం పేరుతో విడుదలచేశారు. ఇక్కడ కూడా పరాజయాన్ని మూట గట్టుకుంది.
Related image
ఈ సినిమాని ఇటీవల ‘వీర్’ పేరుతో హిందీ లో విడుదల చేశారు అక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. తరువాత ఈ హిందీ వెర్షన్ ను యూ ట్యూబ్ లో విడుదల చేయగా కేవలం 24 గంటల్లో 8 మిల్లియన్ల వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డు ను సృష్టించింది. ప్రస్తుతం  చిత్రాన్ని ‘కమాండో’ పేరుతో కన్నడ భాషలో విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అక్కడ భారీ స్థాయిలో విడుదల కానుంది. సుమారు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: