చిరంజీవి కొరటాల శివ సినిమా ఇంకా మొదలు కాకుండానే సమస్యలలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘సైరా’ కు సంబంధించి రకరకాల సమస్యలతో సతమతమవుతున్న చిరంజీవి ఇప్పుడు కొరటాల ప్రపోజల్‌ ని ఎలా డీల్ చెయ్యాలా అని తెగ టెన్షన్ పడుతున్నాడని  ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
 
చిరంజీవి కొరటాల శివ ప్రాజెక్ట్‌ పై అనౌన్స్‌ మెంట్‌ తోనే భారీ అంచనాలు మొదలయ్యాయి. వరస విజయాలతో దూసుకుపోతు నాలుగు విజయాలను అందుకున్న కొరటాల మెగా స్టార్‌ తో ఎలాంటి కథ చేస్తాడు అని మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీవర్గాలు కూడ చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నాయి. సోషల్ మెసేజ్‌ తో ఎక్కువగా సినిమాలుతీసే కొరటాల ఈసారి చిరంజీవితో సామాజిక స్పృహతో కూడుకున్న ఒక  రాజకీయ కథాంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. 
Chiranjeevi Back to Congress Politics?
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ విషయమై ఒక క్లారిటీ వచ్చినా ఈమూవీలో హీరోయిన్‌ గా ఎవరిని తీసుకోవాలి అన్న విషయమై చిరంజీవి కొరటాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి కథ ఫైనల్ కావడంతో ఈమూవీని ఈఏడాది చివరిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరాకు విడుదలచేయాలి అని కొరటాల మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. 
Koratala Siva and Chiranjeevi
భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీకి ఒక ఫ్రెష్ నెస్ తీసుకురావడానికి ఈమూవీ హీరోయిన్ గా కొరటాల ఒక ముంబాయ్ మోడల్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట. అయితే చిరంజీవి ఈసూచనను పూర్తిగా తిరస్కరిస్తూ తన పక్కన అనుష్క లేదా త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్ ను పెట్టమని ఇలాంటి ముంబాయ్ మోడల్స్ ప్రయోగాలు తన పై వద్దని స్పష్టంగా చెపుతున్నట్లు టాక్. దీనితో చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఎవరిని సెట్ చేయాలో తెలియక కొరటాల మరో క్రేజీ బ్యూటీ గురించి అన్వేషణ కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: