దిల్ రాజు బ్యానర్ లో ‘సభకు నమస్కారం’ మూవీ రాబోతోందని పొలిటికల్ టచ్ స్టోరీతో నిర్మింపబడుతున్న ఈమూవీలో హీరోగా నటించడానికి అల్లు అర్జున్ అంగీకరించాడు అంటూ వార్తలు హడావిడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తల పై దిల్ రాజ్ ఒక వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం తన ఆలోచనలలో ‘సభకు నమస్కారం’ సినిమా ఆలోచనలు లేవని అటువంటి ఉద్దేశ్యం ఉంటే తాను తప్పకుండా బహిరంగంగానే చెపుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Dil Raju, Akkineni, Naga Chaitanya, Nagarjuna, Akkineni Multi-starrer on dil raju production
దీనితో దిల్ రాజ్ ప్రమేయం లేకుండానే సభకు నమస్కారం వార్తలు బయటకు వచ్చాయా అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఇలా దిల్ రాజ్ ప్రవర్తించడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. వాస్తవానికి ఒక కొత్త దర్శకుడు ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ తో ఒక పొలిటికల్ లైన్ ను ఇప్పటికే దిల్ రాజుకు చెప్పినట్లు తెలుస్తోంది. 
Allu Arjun’s Duvvada Jagannadham said to have collected 100 crores
అయితే దిల్ రాజ్ కు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది అని టాక్. తన దృష్టికి మంచి మాస్ సినిమా కథలు వస్తే వాటిని అల్లు అర్జున్ కు నెరేట్ చేయడం మంచి ఫ్యామిలీ సినిమాల కథలు వస్తే ఎన్టీఆర్ కు ఒకసారి నెరేషన్ ఇవ్వడం వారి సలహాలు తీసుకోవడం ఎప్పటి నుంచో దిల్ రాజ్ కు ఉన్న అలవాటు అని టాక్. 
Allu Arjun, Allu Arjun Staff, Allu Arjun Personal Staff, Allu Arjun New Staff, Allu Arjun Non Telugu Staff, Allu Arjun Staff Changed, Allu Arjun Dismissed Staff, Allu Arjun Hiring Staff, Allu Arjun Staff Removed, Allu Arjun working Staff, Allu Arjun Recruiting Staff,
ఈ సెంటిమెంట్ తోనే దిల్ రాజ్ బన్నీకి ఈమూవీ కథ చెప్పాడు కాని వాస్తవానికి ఈసినిమాకి హీరో అల్లు అర్జున్ కాడనీ నాని అని తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడుతో ఈసినిమాను తీయాల లేదంటే హరీష్ శంకర్ తో ఈమూవీని తీసి రాబోతున్న ఎన్నికల లోపు విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో దిల్ రాజ్ ఉన్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: