మరో 5 రోజులలో ఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ఈ వెంట్ ను చాలా ఘనంగా సెలిబ్రేట్ చేసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ ఘన విజయం తరువాత వస్తున్న మహేష్ పుట్టినరోజు కావడంతో ఈ ఈవెంట్ ను ఘనంగా సెలిబ్రేట్ చేయాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఈసందర్భంలో మహేష్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే ఒక న్యూస్ మహేష్ అభిమానులకు కలవరపాటు కలిగిస్తోంది.  
 Mahesh Babu ‘Bharat Ane Nenu’ Movie Updates
ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ఈ మూవీ టీజర్ కూడ విడుదల అవుతుంది అని మహేష్ అభిమానులు భావించారు. దీనిపై అధికారిక ప్రకటనను ఆదివారంనాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటిస్తాడు అన్న అంచనాలలో మహేష్ అభిమానులు ఉన్నారు. 
Mahesh Babu in Bharat Ane Nenu
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ముందుగా అనుకున్న విధంగా ఈసినిమాకు సంబంధించి టీజర్ విడుదలచేసే ఆలోచన ఇప్పుడు విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమా టైటిల్ కు సంబంధించి నెలకొన్న అయోమయం అని అంటున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన టైటిల్స్ ఏవీ మహేష్ కు నచ్చకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
Mahesh-Babu
దీనితో మహేష్ పుట్టినరోజునాడు కేవలం ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల అవుతుందని అది కూడ టైటిల్ లేకుండా విడుదల అవుతుంది అని అంటున్నారు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా కాబట్టి ఈమూవీ టైటిల్ తో అందరూ కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. దీనితో ఈమూవీ టైటిల్ పై జరుగుతున్న అయోమయం మరొకసారి తెర పైకి వచ్చింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: