అటు నందమూరి, ఇటు అక్కినేని..ఈ ఇద్దరూ తెలుగు కళామతల్లికి రెండు కళ్ళు. వారిది స్వర్ణ యుగం. ఇపుడు లెజెండరీ యాక్టర్,  తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తున్నారు.   నందమూరి సినీ జీవితం అంటే తప్పకుండా అక్కినేని ఉందాల్సిందే. మరి ఆ పాత్ర  ఎవరు చేస్తారు అన్న సస్పెన్స్ నిన్నటి వరకూ ఉండేది. దానిని ఈ రోజు తొలగిస్తూ అక్కినేని మనవడు సుమంత్ ట్వీట్ చేశాడు. తానే తాత పాత్రలో ఎంటీఆర్ బయోపిక్ లో కనిపించబోతున్నట్లుగా ప్రకటించారు.



ఇప్పటికే ఈ ప్రిస్టేజియస్ మూవీలో దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రానా నిన్ననే దీనిని సంబంధించి ట్వీట్ చేశాడు. దానిని రీట్వీట్ చేస్తూ సుమంత్ తాను అక్కినేనిని అంటూ ప్రకటించేశాడు. సో అటు అన్న గారి పాత్రలో తనయుడు బాలయ్య మెరిపోనుండగా, ఇటు సతీమణీ బసవతారకంగా   విద్యాబాలన్, రానా, సుమంత్, ఇలా మంచి టీం సెట్ అవుతోంది ఈ చిత్రానికి. తెలుగు ప్రేక్షకులు మరో మారు ఈ చిత్రం ద్వారా అటు నందమూరి, ఇటు అక్కినేనిని ఒకేసారి వెండి తెరపై నిండుగా చూసుకుని ఆనందిస్తారనడంలో డౌటే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: