హెబ్భా పటేల్ యూత్ ఆడియెన్స్ కు అసలు పరిచయం అవసరం లేని పేరు. కుమారి 21ఎఫ్ సినిమాతో దుమ్ముదులిపేసిన ఈ చిన్నది చేసిన ప్రతి సినిమాలో అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఈమధ్య కొంత వెనుక పడ్డట్టు అనిపించిన హెబ్భా మళ్లీ రెచ్చిపోయి మరి చేసిన సినిమా 24 కిస్సెస్.


ఆదిత్, హెబ్భా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. హెబ్భా మరోసారి యూత్ పై తన మంత్రం వేసిందని చెప్పొచ్చు. టీజర్ మొత్తం ముద్దులనే నింపేశాడు దార్శకుడు అయోధ్యా కుమార్. సినిమా కూడా యువతరం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదని చెప్పొచ్చు.


ఈమధ్య టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ తో సినిమాలో అడల్ట్ కటెంట్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆరెక్స్ 100 ఇంత హంగామా సృష్టించింది అంటే అది కచ్చితంగా టీజర్, ట్రైలర్స్ మహిమే. మొత్తానికి మళ్లీ కుమారి తన పాత ఫాంలోకి వచ్చేందుకు తెగ కష్టపడుతుంది.


టైటిలే 24 కిస్సెస్ అంటే ఇక హెబ్భా ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా ఉత్సవం జరుపుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. కాన్సెప్ట్ బాగున్నా సినిమా రిలీజ్ టైం లో ఎలాంటి గొడవలు అవుతాయో చూడాలి. పిఎస్వి గరుడవేగ తర్వాత ఆదిత్ చేస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: