సినిమాలకు దూరమై రాజకీయాల బాటపట్టిన పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉపన్యాసాలలో రోజుకు ఒక ట్విస్ట్ కనిపిస్తున్న నేపధ్యంలో ఆ ట్విస్ట్ ల వెనుక ఆంతర్యం పవన్ వీరభిమానులకే అర్ధంకాని విషయంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ఈమధ్య తన ఉపన్యాసంలో పవన్ అత్యంత ఆవేశంతో చేసిన కామెంట్ పై పవన్ వ్యతిరేకులు చాల సెటైర్లు వేస్తున్నారు. 
Jana sena condemns lathi charge on left party organisation
పవన్ రాజకీయాలలోకి రావాలి అని తీసుకున్న నిర్ణయం తన చిన్నతనంలో తాను 7వ క్లాస్ చదువుతున్నప్పుడే నిర్ణయం తీసుకుని రాజకీయాలలోకి రావాలి అన్న తన ఆకాంక్షను పెంచుకున్నాను అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈవిషయమే పవన్ పై సెటైర్లు పడేలా చేస్తోంది. పవన్ వయసు రీత్యా అతడు 7వ తరగతి 1980-81ల మధ్య చదివి ఉండాలని అయితే అప్పటికి రాజకీయాలలో ఒక శకం సృష్టించిన నందమూరి తారక రామారావు కూడ ఇంకా రాజకీయాలలోకి ప్రవేశించని పరిస్థుతులలో పవన్ కు రాజకీయాలలోకి రావాలని ఆలోచనలు ఎలా వచ్చాయి అంటూ కొందరు ఘాటైన సెటైర్లు వేస్తున్నారు.
Pawan gets another legal notice
మరి కొందరైతే పవన్ తన తల్లి కడుపులో ఉండగానే తనకు రాజకీయాలలోకి రావాలని అనిపించిందని భవిష్యత్ లో పవన్ కామెంట్స్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ జోక్ చేస్తున్నారు. అయితే పువ్వు పుట్టగానే పరిమళించడం సహజం కాబట్టి పవన్ కు కూడ తన చిన్నతనం నుండే ప్రజాసేవకు సంబంధించిన ఆలోచనలు వచ్చి ఉంటాయి అంటూ పవన్ వీరాభిమానులు అతడిని పొగుడుతూ పవన్ కు వత్తాసుగా కామెంట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan Porata Yatra

ఇది ఇలా ఉండగా పవన్ వచ్చే ఎన్నికలలో వామపక్షాలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో విజయవాడలో జనసేన - వామపక్షాల ప్రత్యేక సదస్సు జరగనుంది. భూసేకరణ ప్రత్యేకహోదాతో పాటు పలు ప్రజాసమస్యలపై ఉమ్మడి అజెండా ఖరారు చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్నా వివిధ పార్టీలలోని కాస్త పేరున్న నాయకులెవరూ ‘జనసేన’ లోకి రాకపోతున్న నేపధ్యంలో రాష్ట్రంలో కొన్నిచోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి జనసేనకు ఏర్పడటంతో కనీసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఏర్పరచుకుంటే కనీసం పోటీ చేయడానికి అభ్యర్ధులు అయినా దొరుకుతారు అన్న వ్యూహంతో పవన్ కమ్యూనిస్టుల బాట పడుతున్నట్లు సమాచారం..   



మరింత సమాచారం తెలుసుకోండి: