అక్కినేని నాగార్జున వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు అక్కినేని కుటుంబం టోటల్ సపోర్ట్ లభిస్తున్నా అతడు ఇప్పటికీ సెటిల్ అవ్వకపోవడం నాగార్జునను కలవర పెడుతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. డాన్స్ లు బాగా చేస్తాడు అందంగా ఉంటాడు అని అందరూ కామెంట్స్ చేస్తున్నా అతడి సినిమాలు మటుకు ఫ్లాప్స్ గా మారుతూ ఉండటం సమాధానం లేని ప్రశ్నగా మారింది.
akhil hello movie review
గత సంవత్సరం విడుదలైన అఖిల్ 'హలో' బాగుందనే టాక్‌ తెచ్చుకున్నా అతడి మొదటి సినిమా కన్నా రెండవ సినిమాలో నటన విషయంగా ఇంప్రూవ్‌ అయ్యాడనే ప్రశంసలు దక్కినా ‘హలో’ మూవీని అక్కినేని కాంపౌండ్ ఎంత ప్రచారం చేసినా ఆమూవీ ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అయితే క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ తీసిన ‘హలో’ మూవీకి ఇలాంటి ఫలితం రావడానికి గల కారణం అప్పట్లో ఈమూవీ సాయి పల్లవి నానీలు నటించిన ‘ఎంసిఏ’ చిత్రంతో పోటీగా విడుదల కావడం ఒక కారణం అనే కామెంట్స్ కూడ ఉన్నాయి.
Nani and Sai Pallavi in Middle class Abbayi
నాని ‘ఎంసిఎ’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ‘ఫిదా’ తరువాత సాయి పల్లవి నటించిన సినిమా కావడంతో సాయి పల్లవి మ్యానియాలో ఉన్న యూత్ వల్ల ఆమూవీకి అంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో ‘హలో’ చిత్రం పై ‘ఎంసిఎ’ పై చేయి సాధించడంతో నాగార్జునకు నష్టాలు తప్పలేదు. అయితే ఆ షాక్ నుండి తేరుకుని అనేక ఆలోచనలు చేసి అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి మళ్ళీ సాయి పల్లవి శాపంగా మారుతుందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 
Akhil Venky Atluri Movie
దీనికి కారణం అఖిల్ వెంకీ అట్లూరిల కాంబినేషన్ లో ప్రస్తుతం రూపొందుతున్న ఈమూవీ నాగార్జునకు ఉన్న డిసెంబర్ నెల సెంటిమెంట్ తో క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేస్తూ డిసెంబర్ మూడవ వారంలో విడుదల కాబోతోంది. అయితే అదే డిసెంబర్ మూడవ వారంలో శర్వానంద్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' విడుదల చేయబోతున్నారు. ఈమూవీ చాల డిఫరెంట్ గా ఉంటూ యూత్ ను బాగా కనెక్ట్ చేస్తుందని అంటున్నారు. దీనితో అఖిల్ కు మళ్ళీ సాయి పల్లవి త్రెట్ తప్పేలా లేదు అంటూ జోక్స్ పడుతున్నాయి. ఏమైనా అనుకోకుండా సాయి పల్లవి అఖిల్ కు సమస్యగా మారడం యాధృశ్చికం  అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: