యంగ్ టైగర్ జూనియర్ ఎంటీఆర్ విప్లల వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారా...తన తాత సీనియర్ ఎంటీఆర్ వేసిన ఆ చిరస్మరణీయమైన పాత్రను తానూ పోషించి మరో మారు తెలుగు జనాన్ని ఆనందపరచనున్నారా.. అంటే అందుతున్న సమాచారం బట్టీ అవునూ అనే జవాబు వస్తోంది. జక్కన్న రాజమౌళి మెగా పవర్ స్టార్  రాం చరణ్, యంగ్ టైగర్ ఎంటీఆర్ ల సూపర్ కాంబోతో భారీ స్థాయిలో మల్టీ స్టారర్ మూవీ తీస్తున్న సంగతి విధితమే. ఆ మూవీలో ఎంటీయార్ అల్లూరి గెటప్ లో అలరించనున్నారని ఫిల్మ్ నగర్ గ్యాసిప్స్.


బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ :



సరైన  పాత్ర దొరకాలే కానీ అదరగొట్టే దమ్మున్న హేరో యంగ్ టైగర్. మరి అందులోనూ జక్కన్న చెక్కుతున్న మూవీ. ఇక తెలుగు వీరుడు అల్లూరి, ఇవన్నీ అలోచిస్తే జూనియర్ సీనియర్ తాతను గుర్తు చేసేలా  అదరగొట్టడం ష్యూర్ అంటున్నారు. ఇదే జరిగితే ఫ్యాన్స్ కి  ఇక పండగే పండగ. నిజానికి ఈ చిత్ర కధ గురించి ఎక్కడా రాజమౌళి రివీల్ చేయకపోయినా దేశ స్వాతంత్రానికి రిలేటెడ్ గా  ఉన్న స్టోరీ అంటూ రూమర్లు అపుడే వస్తున్నాయి.



అద్భుతమైన స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కొడుకు చేతిలో పెట్టాడని తెలుస్తోంది. ఇద్దరు సూపర్ స్టార్లు చరణ్, జూనియర్ లను ఆయుధంగా చేసుకుని జక్కన్న రెచ్చిపోతాడని, బాహుబలిని మించిన రేంజిలో బీభత్సమైన సెన్సేషన్ క్రియేట్  చెయడం ష్యూర్ అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: