ఎన్టీఆర్ బయోపిక్ ను తెలుగుజాతి గొప్పతనం చాటిన మహనీయుడి చరిత్రగా ప్రస్తుతం తెరకెక్కించడంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఈ మూవీ దర్శకుడు క్రిష్ తో కలిసి ఈమధ్య ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. అక్కడ ఏప్రాంతాలలో ఎన్టీఆర్ బయోపిక్‌ షూటింగ్ తీస్తే బాగుంటుందో అన్న విషయం పై లోకేషన్స్ ఎంపికకు వచ్చిన బాలయ్య అక్కడ తనను కలిసిన మీడియా వర్గాలతో ఈ బయోపిక్ ను గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
ఎన్టీఆర్ స్వగ్రామంలో షూటింగ్
ఎన్టీఆర్ బయోపిక్ ఏ పార్టీకి అదేవిధంగా ఏవర్గానికి సంబంధించింది కాదని అంటూ ఎన్టీఆర్ జీవితంలో ఉన్న అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఈ బయోపిక్ లో కనిపిస్తారు అంటూ కామెంట్స్ చేసాడు నందమూరి సింహం. అయితే ఈమూవీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రలు ఉంటాయి కానీ కుటుంబ సభ్యులలో కొందర్ని మాత్రమే తాము ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటారు అని బాలయ్య తెలిపారు. 
తీగ లాగితే డొంకంతా... అలా అడగొద్దు
అయితే ఆకుటుంబ సభ్యులు అంతా రియల్ గా తెరపైకి కనిపిస్తారా లేదంటే వారి పాత్రలలో వేరే నటులు కనిపిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నాడు బాలయ్య. ఇదే సందర్భంలో బాలకృష్ణను ఒక మీడియా సంస్థ ప్రతినిధి సినిమాలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారు ప్రశ్నించినప్పుడు బాలయ్య నవ్వుతూ తీగ లాగితే డొంకంతా కదిలించ వచ్చు అన్నట్లు ఆప్రశ్న ఉంది అని జోక్ చేస్తూ తన పాత్రలో ఎవరు నటిస్తారు తనకు సంబంధించిన వారే అంటూ ఈమూవీ విడుదలయ్యేదాకా కాస్త ఆగండి అంటూ వ్యూహాత్మకంగా స్పందించాడు బాలయ్య. 
ఎన్టీఆర్ గురించి మనకు తెలిసింది ఒక శాతమే: క్రిష్
బాలయ్య నోటి వెంట ఈకామెంట్స్ విన్న మీడియా వర్గాలు వ్యూహాత్మకంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞను యంగ్ హీరో బాలయ్యగా చూపెట్టబోతున్నాడా అన్న సందేహాలను తమలో తాము వ్యక్త పరుచుకున్నట్లు టాక్. ఇదే సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ లో 99 శాతం బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఉంటాయి అని లీకులు ఇవ్వడం బట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో చాల సంచలనాలు ఉండబోతున్నాయి అన్న అభిప్రాయం బాలకృష్ణ మాటలను బట్టి అర్ధం అవుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: