నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ ఎలిమినేషన్ డేని ఫ్రెండ్ షిప్‌ డే సెలబ్రేషన్స్ డేగా మార్చి నాని నిన్నటి కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించాడు. ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే కావడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు నాని అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈసందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులు తమ స్నేహితులతో తమకు ఎదురైన అనుభవాలు వివరించారు.
సామ్రాట్ జైల్లో ఉన్న సమయంలో
ఈసందర్భంలో సామ్రాట్ తన జీవితంలో ఇటీవల జరిగిన చేదు సంఘటనను వివరించి ఈషోకు హైలెట్ గా మారాడు. ఈమధ్య తనపై తన భార్య పెట్టిన కేసును వివరిస్తూ ఆసమయంలో తనను మూడురోజులు పోలీసు స్టేషన్ లో ఉంచినప్పుడు తన స్నేహితుడు తనకు అండగా నిలిచి చేసిన సహాయాన్ని గుర్తుకు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. 
రోల్ రైడాపై బిగ్ బాంబు
మరో కంటెస్టెంట్ రోల్ రైడా మాట్లాడుతూ తన ఏరియాలో ఉండే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని అనుకున్నప్పుడు ఆమెను రైల్వే స్టేషన్ కు రమ్మని చెప్పినప్పుడు ఆమె సన్నిహితులు ముగ్గురు వచ్చి తనను గూబ పగిలేలా కొట్టిన సందర్బాన్ని వివరించి అందరకీ నవ్వులు పంచాడు. ఇదే సందర్భంలో తనిష్ మాట్లాడుతూ తన తమ్ముడుని ఇంజనీరింగ్ చదివించడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే నానీకి ఫోన్ చేసి డబ్బు అడిగిన విషయాన్ని వివరిస్తూ తనకు బిగ్ బాస్ షో హోస్ట్ నానీకి గల స్నేహాన్ని బయటపెట్టాడు.
ఇంట్లోకి గూఢచారి
ఇలా అందరూ తమ జీవితాలలో సహకరించిన మిత్రుల గురించి ఉద్వేగంగా చెప్పడం నిన్నటి షో హైలెట్. ఇక చివరిగా ఎలిమినేషన్ ప్రక్రియలో నందినిని ఎలిమినేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వివరించి చివరిగా నందిని చేత రోల్ రైడాపై బిగ్‌బాంబ్ విసిరేలా నాని నిన్నటి షోను రక్తికట్టించాడు. ఈ బిగ్‌ బాంబులో భాగంగా రోజు ఒకరికి రోల్ రైడా మసాజ్ చేయాలి. ఆ సమయంలో ఇంటిలోని సమస్యలపై సభ్యుడితో చర్చించాలి. దీనికితోడు నిన్నటి కార్యక్రమంలో ‘గూఢచారి’ ‘చి.ల.సౌ’ సినిమాలకు సంబధించిన నటీనటులు రావడంతో నిన్నటి షో కోలాహలంగా మారి మంచి రేటింగ్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కార్యక్రమ హోస్ట్ నాని ‘బిగ్ బాస్’ హౌస్ మేట్స్ విషయంలో ఎక్కువగా కౌశల్ పొరపాట్ల పై దృష్టి పెడుతూ మిగతా వారిని తక్కువ విమర్శించడంతో కౌశల్ పాపులారిటీని తగ్గించడానికి నానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ అప్పుడే నానీపై సోషల్ మీడియాలో సెటైర్స్ మొదలైపోయాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: