మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్  కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అయితే  తాజా గా అతను నటించిన యాడ్ మీద కేరళ బోర్డు కోర్ట్ కు వెళ్ళింది. ఓ అడ్వర్టయిజ్ మెంట్ కి సంబంధించి మోహన్ లాల్ కి లీగల్ నోటీసులు జారీ చేసింది. ఓ దుస్తుల కంపెనీ ప్రకటనలో చరఖా(రాట్నం) వడుకుతున్నట్టు మోహన్ లాల్ నటించాడు. చరఖా దేశ వారసత్వ సంపదకు చిహ్నమని, ముఖ్యంగా అది గాంధీయిజం, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిందని చెబుతూ కేరళ ఖాదీ బోర్డు ఆ కంపెనీకి, మోహన్ లాల్ కి నోటీసులు జారీ చేసింది.

Image result for mohan lal

క్షమాపణ చెప్పి, ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేసింది.ఇటీవలే మోహన్ లాల్ నటించిన ఓ జ్యూవెల్లరీ యాడ్ ను కూడా ఇలాగే కోర్టు కేసుల వల్ల పూర్తిగా డిలీట్ చేశారు. బ్యాంకులకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ ప్రకటనను తొలిగించారు. ఇదే ప్రకటనను తెలుగులో నాగార్జున చేస్తే దాన్ని కూడా తీసేశారు. కేవలం అడ్వర్టయిజ్ మెంట్లే కాదు.. ఈ మధ్య కేరళ సినీ ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు కూడా మోహన్ లాల్ ప్రతిష్టను దెబ్బతీశాయి.

Image result for mohan lal

హీరోయిన్ పై లైంగిక దాడి కేసులో రిమాండ్ కి వెళ్లొచ్చిన హీరో దిలీప్ కి, మోహన్ లాల్ ఓపెన్ గా మద్దతు తెలిపారు. దీనిపై అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) భగ్గుమంది. వరుస రాజీనామాలతో 'అమ్మ'లో నటీనటులు హోరెత్తించారు. చివరకు దిలీప్ స్వచ్ఛందంగా అసోసియేషన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తెరపై సూపర్ స్టార్ అనిపించుకున్న మోహన్ లాల్.. ఇలా యాడ్స్, వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలు, లీగల్ నోటీసులు ఎదుర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: