పవన్‌ కల్యాణ్‌ మొట్టమొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ లో పవన్ పక్కన హీరోయిన్ గా నటించిన నాగార్జున మేనకోడలు సుప్రియ ఆతర్వాత సినిమాలకు దూరమమై అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని నిర్వహిస్తూ 22ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె ఆసినిమాలో ఆమెనటించిన నదియా ఖురేషి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఈమూవీ ఘనవిజయం సాధించడంతో తిరిగి ఆమె మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్థాయిపై సంచలనవ్యాఖ్యలు చేసింది.
Supriya Yarlagadda
తాను సినిమాలకు దూరమై 22 ఏళ్లు అయిపోయిన తరువాత తనను వెండితెర పై చూస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నభయం చివరివరకు ఉందని అందువల్లనే తాను ఈమూవీ విషయంలో తెగ టెన్షన్ పడ్డ సందర్భాలను వివరించింది. ఒకహాలీవుడ్ మూవీలోని నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రను ఆధారంగా తీసుకుని తన నదియా పాత్రను డిజైన్ చేసిన విషయాన్ని వివరిస్తూ కెమెరా ముందుకు రాగానే తనతాత అక్కినేని గుర్తుకు వచ్చి ఎటువంటి భయంలేకుండా తాను నటించాను అంటోంది సుప్రియ. 

ఆశ్చర్యకరంగా ఈసినిమా విడుదలై రెండురోజులు కూడ గడవకుండానే తనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అక్కినేని అభిమానుల దగ్గర నుంచి తాతయ్య పేరు నిలబెట్టావు అంటూ వస్తున్న మెసేజ్ లు చూసి తనకు కలిగిన ఆనందంతో ఇకపై తాను యాక్టింగ్ కంటిన్యూ చేస్తానని సుప్రియ లీకులు ఇస్తోంది. అయితే తన మొహం నెగిటివ్ కేరెక్టర్స్ కు బాగా సూటవుతోంది కాబట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు తన దృష్టికి వస్తే నటిస్తూ తన తాత మనవరాలిగా తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటోంది అక్కినేని మనవరాలు.

 ఎవరికైనా జీవితం ఎప్పుడు ఏమలుపు తిరుగుతుందో తెలియదు అని అంటూ తాను రైటర్ కావాలని కలలు కంటే తనను మళ్ళీనటిగా ఆదరిస్తున్న ప్రేక్షకుల అభిమానం చూసి తనకు ఆశ్చర్యంకలుగుతోంది అంటూ తనతో మొట్టమొదటిసారి హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ గురించి ఒక షాకింగ్ కామెంట్ చేసింది సుప్రియ. పవన్‌ కల్యాణ్‌ తో తాను హీరోయిన్ గా 22 ఏళ్ల క్రితం నటించినా ఇప్పటికీ తనను చాలామంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా గుర్తిస్తూ ఉంటారని దీనితో తనకంటూ సొంత గుర్తింపు రాదా అన్న బాధను ‘గూఢచారి’ లో నదియ పాత్ర తీర్చింది అని అంటోంది. అయితే గతంలో తాను పవన్ తో నటించినప్పుడు పవన్ ఈరేంజ్ కి టాప్ హీరోగా మారతాడాని తనకు అప్పట్లో ఏమాత్రం అనిపించలేదు అంటూ పవన్ స్థాయి పై షాకింగ్ కామెంట్స్ చేసింది సుప్రియ..   



మరింత సమాచారం తెలుసుకోండి: