సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల దాంపత్య జీవితం 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిన్న ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయనిర్మల కొడుకు మహేష్ తండ్రి కృష్ణల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అదేవిధంగా వీరిద్దరి మనస్తత్వం గురించి విజయ్ నిర్మల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. కేవలం రూపంలో మాత్రమే కాకుండా మహేష్ మనస్తత్వం విషయంలో కృష్ణకు చాలదగ్గరగా ఉంటాడని అంటూ హీరోయిన్స్ తో వీరిప్రవర్తన విషయంపై కొన్ని ఆసక్తికర విషయాలను లీక్ చేసింది. 

మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ తో ఎన్నోసినిమాలు చేసినా హీరోయిన్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నటించే రొమాంటిక్ సీన్స్ విషయంలో ఇప్పటికీ మహేష్ వీక్ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది విజయనిర్మల. ఇదేపోలిక సూపర్ స్టార్ కృష్ణలో కూడ ఉంది అనిఅంటూ చాలామంది హీరోయిన్స్ గతంలో కృష్ణకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా కృష్ణ వారి పేరు చెపితేనే పారిపోయిన సందర్భాలను వివరిస్తూ మహేష్ పరిస్థితి కూడ అదే అంటూ జోక్ చేసింది ఈమహిళ దర్శకురాలు. 
Mahesh Babu New Latest Stylish ULTRA HD Photos Stills Images Gallery
అదేవిధంగా వేరే అమ్మాయిలతో మాట్లాడేటపుడు కృష్ణ తలవంచుకునే ఉంటారని అదేపద్ధతి మహేష్ కు కూడ వచ్చింది అంటూ అమ్మాయిల కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని మహేష్ అనుకుంటూ ఉంటాడన్న సీక్రెట్ ను విజయనిర్మల బయటపెట్టింది. ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ ను చూస్తే ఎవరికైనా సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకురావడం ఖాయం అనిఅంటూ మహేష్ ఒకవ్యక్తిగా చాలా మంచివాడు అవ్వడమే కాకుండా అలాంటి బిడ్డకు తల్లితండ్రులు కావడం ఎవరికైనా అదృష్టం అంటూ మహేష్ మంచితనం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. 
mahesh babus special birthday wishes to his father superstar krishna
ఇదేసందర్భంలో కృష్ణ బయోపిక్ తీసే ఆలోచనలను గురించి వివరిస్తూ కృష్ణ పాత్రలో నటించగల స్థాయి ఉన్న హీరో ఎవరు లేకపోవడంతో తనకు కృష్ణ జీవితం పై బయోపిక్ తీయాలనే కోరిక ఉన్నా ఆసినిమాను తాను తీయలేకపోతున్నాను అన్నబాధను వ్యక్త పరిచింది విజయనిర్మల. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా నటించే చాలామంది హీరోలు ఉన్నా మహేష్ స్థాయిలో అందంగా ఉండే హీరో ఎవరూ లేని నేపధ్యంలో మహేష్ స్థాయిని అందుకోగల హీరో తనదృష్టిలో ఎవరు లేరు అంటూ ఇండస్ట్రీకి నిజమైన సూపర్ స్టార్ మహేష్ అంటూ అతడిని ఆకాశంలోకి ఎత్తేస్తూ విజయనిర్మల చేసిన కామెంట్స్ మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: