ఎప్పుడో కృష్ణ గారు చేసిన గూఢచారి116 తర్వాత అసలు సిసలు జేమ్స్ బాండ్ తరహా కథలు రాలేదని చెప్పాలి. కృష్ణ వారసుడు సూపర్ స్టార్ మహేష్ కూడా టక్కరిదొంగ, వంశీ లాంటి స్పై థ్రిల్లర్ సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఏమాత్రం అంచనాలు లేని ఓ చిన్న సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.


అడివి శేష్ హీరోగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమా గూఢచారి. శషి కిరణ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ, కథనం రాసింది అడివి శేషే అని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. క్షణం, గూఢచారి రెండు సినిమాలు అడివి శేష్ సత్తా ఏంటో ప్రూవ్ చేశాయి. ఇక గూఢచారి వీకెండ్ కలక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. 


మొదటి రోజు కోటిన్నర దాకా వసూళ్లను రాబట్టిన గూఢచారి సినిమా వీకెండ్ లో 3.5 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. యూఎస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 3,10,000 ల డాలర్స్ వసూళు చేసింది. 117 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తో 53,000ల డాలర్స్ వసూళు చేసింది.


ఇక వీకెండ్ లో మాత్రం కలక్షన్స్ దుమ్మురేపింది. కంటెంట్ ఉన్న సినిమా బాక్సాఫీస్ పై చెడుగుడు ఆడటం ఖాయమని మరోసారి ప్రూవ్ చేసింది గూఢచారి మూవీ. 6 కోట్ల బడ్జెట్ తో అద్భుతమైన సినిమా చేసిన గూఢచారి యూనిట్ కచ్చితంగా బీభత్సమైన లాభాలు తెచ్చుకునేలా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: