ఈ మద్య  చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయిందని ఎంతో మంది నటీమణులు గొంతెత్తి తమ బాధ్య వ్యక్తపరుస్తున్నారు.   ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పడక సుఖం అందిస్తేనే..సినిమా ఛాన్స్ ఇస్తారని లేదంటే కనీసం జూనియన్ ఆర్టిస్ట్ గా కూడా ఛాన్స్ ఉండదని వాపోతున్నారు.  అయితే చిత్రపరిశ్రమలో చిన్న నుంచి పెద్దల వరకు ఆడవాళ్లను మోసం చేయాడానికి చూసే వారని పలువురు నటీమణులు ఆరోపిస్తున్నారు.  ఆ మద్య నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.

అయితే సినిమా పేరు చెప్పుకొని కొంత మది అమాయకంగా ఉన్న అమ్మాయిలను మోసం చేస్తూ వారితో శారీరక సఖం అనుభవించిన తర్వాత ముఖం చాటేసేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి మోసం చేసిన యువ దర్శకుడి పై కేసు నమోదు అయ్యింది . పి . లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రేమ పేరుతో నమ్మించి , పెళ్లి చేసుకుంటానని మాయమాటలు శారీరకంగా అనుభవించి ఇప్పుడు  మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించింది సదరు జూనియర్ ఆర్టిస్ట్ . 

కాగా,  పి . లక్ష్మి తో కొంతకాలం సహజీవనం చేసి కోరికలు తీర్చుకున్న శ్రీ దత్త అనే యువ దర్శకుడి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆ దర్శకుడు పరారీలో ఉన్నారని..దర్శకుడి ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టి తరుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: