Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 12:38 pm IST

Menu &Sections

Search

ఈ ఇద్దరూ సై.. ఆ ఇద్దరూ సైడ్...టాప్ ఫోర్ టైం మారిందిలా !!

ఈ ఇద్దరూ సై.. ఆ ఇద్దరూ సైడ్...టాప్ ఫోర్ టైం మారిందిలా !!
ఈ ఇద్దరూ సై.. ఆ ఇద్దరూ సైడ్...టాప్ ఫోర్ టైం మారిందిలా !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చలన చిత్ర సీమలో సీనియర్ నటులుగా టాప్ ఫోర్ ఉన్నారు. వరే చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్, 80, 90 దశకాలను వీరంతా ఓ ఊపు ఊపారు. ఆ తరువాత కుర్రతరం నటులు రావడంతో వీరి డిమాండ్ తగ్గింది. ఇక 2010 తరువాత మరింతగా నెమ్మదించింది. అయితే ఇప్పటీకీ సోలోగా సత్తా చాటుతున్న వారు చిరంజీవి, బాలయ్య కావడం విశేషం. రాజకీయాలోకి వెళ్ళిన చిరంజీవి ఆ తరువాత ఖైదీ నంబర్ 150 తో మళ్ళీ అదరగొట్టేశాదు.
chirajneevi,-naagarjuna,-venkatesh,-balakrishna


ఎక్కడా తన స్టామినా తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడమే కాదు 100 కోట్ల పైబడి వసూళ్ళూ సాధించాడు. ఇపుడు సైరా అంటూ ఉయ్యాలవాడ నరసిమ్హారెడ్డి సినిమా చేస్తున్న చిరు తరువాత చిత్రం మాస్ డైరెక్టర్ కొరటాలతో చేస్తున్నాడు. సో చిరు జోరు ఇప్పట్లో ఆగేలా లేదు.

బాలయ్య గోలయ్యా :

chirajneevi,-naagarjuna,-venkatesh,-balakrishna


మరో హీరో బాలయ్య 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా రికార్డులు క్రియేట్  చేసింది. సిమ్హా, లెజండ్ వంటి  సూపర్ దూపర్ హిట్లు సోలోగా అందుకున్న బాలయ్య లేటెస్ట్ గా ఈ ఏడాది జనవరిలో జై సిమ్హా అంటూ మరో హిట్ సొలోగా కొట్టాదు. ఇపుడు అన్న నందమూరి బయోపిక్ తో రెడీ అంటున్నాడు. దీని తరువాత బోయపాటితో పవర్ ఫుల్  మసాలా మూవీ రెడీ చేసి పెట్టుకున్న బాలయ్య, ఇంకోవైపు వీవీ వినాయక్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికైతే బాలయ్య తగ్గేట్టు లేడు మరి.

రూట్ మార్చిన వెంకీ

chirajneevi,-naagarjuna,-venkatesh,-balakrishna

టాలివుడ్ లో టాప్ ఫోర్ లో ఉన్న మరో ఇద్దరు నాగార్జున, వెంకటేష్ సోలో హీరో పాత్రలకు ఫుల్ స్టాప్  పెట్టేసి చాలా కాలమైంది. ఈ ఇద్దరు నటులూ యూత్  హీరోలతో నటిస్తూ స్క్రీన్ పంచుకుంటున్నారు. వెంకటేష్ చాలా  ముందుగా దీన్ని స్టార్ట్ చేస్తే తరువాత నాగార్జున జాయిన్ అయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెంకటేష్ మరో హీరో మహేష్ తో కలసి నటించాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలసి గోపాలా. గోపాలా నటించాడు. ఇక రాం తో కలసి మసాలా చేశాడు. ద్రుశ్యం మూవీలో మిడిల్ ఏజ్ పాత్రలో కనిపించాడు. ఇలా వెంకీ తన ఏజ్ ని బట్టీ సర్దుకుపోతూ వస్తున్నాడు, హిట్లూ కొడుతున్నాడు. లేటెస్ట్ గా వెంకటేష్ మెగా హీరో వరుణ్ బాబుతో కలసి ఓ మూవీ చేస్తున్నాడు.


దేవదాస్ అయిపోయాడు :