సినిమా ఇండస్ట్రీలో కొంత మది హీరో, హీరోయిన్లు బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో నటించాల్సి వచ్చినా కొన్ని అనుకోని కారణాల వల్ల  ఆ ప్రాజెక్ట్ ల నుంచి పక్కకు తప్పుకుంటారు..కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత నాలుక్కరుచుకుంటారు..అబ్బా అంత మంచి హిట్ సినిమా తాము చేయాల్సి వేరే నటులు చేశారని తెగ బాధపడుతుంటారు. ‘పెళ్లి చూపులు’లాంటి సినిమాతో మంచి విజయం అందుకున్న హీరోయిన్ రీతూవర్మ తాజాగా గూఢచారి సినిమాని మిస్ చేసుకున్నందుకు బాధపడుతొంది.   
Image result for adivi sesh goodachari
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది రీతూ వర్మ.  అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తర్వాత మరికొన్న సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నా చాలా సెలెక్టీవ్ గా కథలు ఎంచుకొని నటిస్తుంది రీతూ వర్మ. ఈ నేపథ్యంలో  అసలు గూఢచారి సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నే ఎంచుకున్నారు.  కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేక పోయింది..అయితే  అడవి శేష్ ని లైట్ గా తీసుకొని ఉంటుందని.. దాంతో గూఢచారి సినిమా చేయడానికి నిరాకరించిందని టాక్ వినిపిస్తుంది. 

దాంతో రీతూ వర్మ స్థానంలో శోభిత దూళిపాళ్ల ని తీసుకున్నారు ఇంకేముంది ఆ భామ రెచ్చిపోయి లిప్ లాక్ ఇచ్చి మరీ హిట్ కొట్టింది. ఆగస్టు 3న విడుదలైన గూఢచారి చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ రాగా వసూళ్లు కూడా మెల్లిగా పెరుగుతున్నాయి. రీతూ వర్మ ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు ఇపుడు బాధపడుతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. అయినా ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకు అది దక్కుతుంది కానీ ఇప్పుడు కుయ్యో మొర్రో అంటే ఏం లాభం .


మరింత సమాచారం తెలుసుకోండి: