ఆమె వెండి తెర వేలుపు, ఎందరో యువ హ్రుదయాలకు కలవరం పుట్టించే కలల దేవత. యువ రాణీగా దర్పం చూపించాలన్నా ఆమెకే సాధ్యం. వీర సాహస నారిగా రాణించాలన్నా ఆమెకే సొంతం. తెలుగు తెర తరించేలా  తన అందంతో విన్యాసం చేసే ఆ సుందరి, తన నటనా పటిమతో అలనాటి తారలను గుర్తుకుతెస్తుంది. చారిత్రక పాత్రలైనా, జానపద కధనాలైనా, పౌరాణిక అంశాలైనా ముందుగా వినిపించేది ఆమె పేరే. ఆమె ఎవరో కాదు. అతిలోక సౌందర్య రాశి అనుష్క. ఆమెతోనే  మళ్ళీ మొదలైంది లేడీ ఓరిఎంటెడ్ చిత్రాల కదలిక.


పదమూడేళ్ళ క్రితం సూపర్ అన్ని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క మొదట్లో వేసినవి గ్లామర్ పాత్రలే. వాటితో  యువతను విశేషంగా ఆకట్టుకుని తనకంటూ ఓ స్థానం సాధించి రాణిస్తున్న టైంలో అనుష్క లక్  ఒక్కసారి అలా తిరిగింది. అరుంధతి చిత్రం ఆమెనే ఎంచుకుని చెంతకు వచ్చింది. ఆ చిత్రంతో ఆమె నటన మేలి మలుపు తిరిగింది. ఆమె స్థానం టాలీవుడ్లో  సుస్థిరం అయింది. అనుష్క తప్ప అటువంటి  పాత్రలు వేరెవరూ  పోషించలేరని ప్రూవ్ అయింది.


ఆ తరువాత బాహుబలి అనుష్కను ఎక్కడికో తీసుకుపోయింది. ఆమెలో సరికొత్త కోణాన్ని  ఆవిష్కరించింది. ఇక  రుద్రమదేవి అంటే అనుష్కేనా అనేంతగా నటనతో కట్టిపడేసింది. భాగమతిగా అనుష్క అలరించిన తీరు అమోఘం. మధ్యలో వేదం చిత్రంలో ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అంటూ యువ మనసులను తనతో పాటే ఎగరేసుకుపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనుష్క బెంగులూర్ బేబీ అయినా తెలుసు సినీ సీమకు వరంగా మారిందంటే అందులో అతిశయోక్తి లేదు. 


వన్నె చిన్నెల రాణిగా వెండితెరపై ఆడుతూ పాడుతూ మురిపించే ఈ అమ్మడు కు ఇంకా పెళ్ళి కాలేదన్నది తెలిసిందే. పదహారు పరువాలు పరచి వెండి తెరను పండు వెన్నెలగా మార్చేసిన అనుష్క వయసు 36 ఏళ్ళు. కానీ ఆమె తరగని అందం, సోయగాలతో ఎప్పటికీ పదహారే అన్నట్లుగా అభిమానుల గుండెలలో కొలువుండిపోయిన తీరు అద్భుతం, అమోఘం. హీరోయిన్స్ లో అలా అందం, అభినయంతో ఇంతకాలం కొనసాగిన వారు అతి తక్కువమంది ఉంటారు.


వారిలో అనుష్కది ఓ ప్రత్యేక స్థానం. లేటెస్ట్ గా అనుష్క ఓ లేడీ ఓరిఎంటెడ్ మూవీలో యాక్ట్ చేసేందుకు సైన్ చేసిందని టాలివుడ్ టాక్. సో ఆ ముద్దు గుమ్మను మరో మారు కొత్త చిత్రంలో చూడొచ్చు. ఇక మరిన్ని మంచి పాత్రలతో అనుష్క అలరించాలని ఆకాక్షిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: