మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ రిజల్ట్ అప్పుడే బయటకు వచ్చేసింది. తెలుస్తున్న సమాచారం మేరకు నిర్మాత దిల్ రాజ్ ఈమూవీని తన సన్నిహితులకోసం అదేవిధంగా కొంతమంది టాప్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఒక స్పెషల్ షోగా వేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ స్పెషల్ షోను చూసినవారు అంతా ఈమూవీ ‘బ్లాక్ బస్టర్ ఇన్ వెయిటింగ్’ అంటూ అప్పుడే శుభాకాంక్షలు దిల్ రాజ్ కు తెలుపుతున్నట్లు సమాచారం.
srinivasa kalyanam
ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సంగీతం కూడ మిళితం కావడంతో ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అన్న అభిప్రాయాన్ని ఈమూవీ స్పెషల్ షోను చూసిన వారు దిల్ రాజ్ కు తమ అభిప్రాయాలను తెలుయచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా గతంలో ‘బొమ్మరిల్లు’ విడుదల అయిన ఆగష్టు 9 సెంటిమెంట్ తో విడుదల అవుతున్న నేపధ్యం కూడ ‘శ్రీనివాస కళ్యాణం’ కు కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. 
Nithin Srinivasa Kalyanam Shoot Begins - Sakshi
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న ఈవార్తలు దిల్ రాజ్ కు మాత్రమే కాకుండా హీరో నితిన్ కు కూడ జోష్ ను కలిగిస్తున్నట్లు సమాచారం. ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాల వరస పరాజయంతో సతమతమవుతున్న నితిన్ కు ‘శ్రీనివాస కళ్యాణం’ సక్సస్ అత్యంత కీలకం. పెళ్లి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈసినిమా పై ‘శతమానం భవతి’ పోలికలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపధ్యం తెలిసిందే. 

‘శతమానంభవతి’ సినిమాలోలానే ‘శ్రీనివాస కళ్యాణం’ లో కూడ విలన్ కనిపించడు. కేవలం హ్యూమన్ ఎమోషన్స్ మాత్రమే విలన్ గా మారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో పెళ్ళి బ్యాక్ డ్రాప్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ లో దర్శకుడు సతీష్ వేగేశ్న చాల అద్భుతంగా మలచినట్లు చెపుతున్నారు. అయితే ఈమధ్య కాలంలో పెళ్ళి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాల సినిమాలు ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈ సెంటిమెంట్లు దాటుకుని ‘బొమ్మరిల్లు’ సెంటిమెంట్ తో ఈమూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో మరో రెండు రోజులలో తేలిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: