పెళ్లి అంటే నూరేళ్ల పంట..పెళ్లితో కొత్త తరం ఇంటికి వస్తుంది..కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. ఇదే కాన్సెప్ట్ తో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నితిన్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ సినిమా గురించి హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ..సినిమా అంతగా తన హృదయాన్ని తాకిందని చెప్పింది. ఉత్తరాదికి చెందిన అమ్మాయిని కావడం వల్ల తెలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని రాశీ ఖన్నా తెలిపింది. సాధారణంగా తెలుగువారి పెళ్లిళ్లకు హాజరైనా.. వధూవరులతో ఫొటో దిగి రావడమే తప్ప సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆమె చెప్పింది.
అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తనకు ఎన్నో కొత్త అనుభవాలు ఎదురయ్యాయని..శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుగు పెళ్లి తంతుల పరమార్థం తెలిసిందని చెప్పుకొచ్చింది. తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు.. తదితర విషయాలను శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుసుకున్నానని రాశీ తెలిపింది.
అంతే కాదు భవిష్యత్తులో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాశీ నవ్వుతూ చెప్పింది. ఒకవేళ తెలుగు అబ్బాయిని చేసుకోకపోయినా.. నా పెళ్లి అచ్చమైన తెలుగు సాంప్రదాయంలో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు ఎప్పుడు పెళ్లి జరిగినా ఈ సినిమాను గుర్తు చేసుకోవడం మాత్రం ఖాయం అంటుంది రాశీఖన్నా.
5/
5 -
(1 votes)
Add To Favourite