గత 10సంవత్సరాలుగా హీరోగా రాణించాలని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఏప్రయత్నం విజయవంతం కాకపోవడంతో ఈ అక్కినేని యంగ్ హీరో గతవారం విడుదలైన ‘చి.ల.సౌ’ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈసినిమాకు వచ్చిన రేటింగ్స్ ను బట్టి ఈమూవీ కనీస విజయం సాధిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలకు వచ్చాయి.
Sushanth-Chi La Sow Telugu Movie First Look Stills-2
అయితే ఈమూవీకి మాస్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్లాస్ ప్రేక్షకులు కూడ ధియేటర్స్ కు రాకపోవడంతో వీకెండ్ ముగిసిన తరువాత నిన్నటి సోమవారం పరీక్షలో ‘చి.ల.సౌ’ కలక్షన్స్ విషయంలో చాల వెనకపడింది అన్నవార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమా సుశాంత్ ఫెయిల్యూర్ లిస్టులో చేరిపోయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా మినిమమ్ రేంజ్ హిట్ గా మారవలసి ఉన్నా ఇలాంటి పరిస్థితి ‘చి.ల.సౌ’ కు ఏర్పడటానికి గల కారణం నాగార్జున తీసుకున్న తప్పుడు నిర్ణయం అని అంటున్నారు. 
Chi La Sow
ఈమూవీని మొదట్లో జూలై 27న విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు భావించారు. అయితే ఈమూవీ నిర్మాతలలో ఒకడిగా చేరిన నాగార్జున సూచనలతో ఈమూవీ రిలీజ్ డేట్ ను జూలై 27 నుండి ఆగష్టు 3కు మార్చారు. ఇలాంటి నిర్ణయం నాగార్జున తీసుకోవడానికి గలకారణం జూలై 27న విడుదలైన హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా ‘మిషన్ ఇంపాజబుల్’ అని అంటున్నారు. ఈమూవీ తెలుగులో కూడ డబ్ చేయడంతో ఈమూవీతో సమానంగా పోటీపడి ‘చి.ల.సౌ’ విజయం సాధించలేదని నాగార్జున ఈమూవీని ఆగష్టు 3కు పట్టుబట్టి వాయిదా వేయించినట్లు సమాచారం. 

అయితే ఆగష్టు 3న విడుదలైన అడవి శేషు ‘గూఢచారి’ మూవీ సక్సస్ ను ఊహించడంలో ఫెయిల్ అయిన నాగ్ అనవసరంగా ‘చి.ల.సౌ’ ను ‘గూఢచారి’ తో పోటీకి దింపి అనవసరంగా సుశాంత్ కెరియర్ పై ప్రయోగాలు చేసాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. గతంలో కూడ నాగార్జున అఖిల్ నటించిన ‘హలో’ మూవీని నాని ‘ఎం.సి.ఎ’ ను తక్కువగా అంచనా వేసి అఖిల్ కెరియర్ కు కీడు చేసాడు అన్న కామెంట్స్ వచ్చాయి. దీనితో ఇప్పటి యూత్ ట్రెండ్ ను పట్టుకోవడంలో నాగార్జున ఫెయిల్ అవుతున్నాడా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: