సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్‌ సతమతమవుతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం డీఎండీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కోలుకున్నారు. 


ట్రీట్ మెంట్ కోసం తన భార్య ప్రేమలత, కుమారుడు షణ్ముగపాండియన్ లతో కలసి గత నెల 7న ఆయన అమెరికా వెళ్లారు.  వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్న ఆయన ఇప్పుడు  కోలుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. 

Image result for నటుడు విజయకాంత్ అనారోగ్యం

 అయితే విజయ్ కాంత్ పూర్తిగా కోలుకొని మరో వారం రోజుల్లో చెన్నై రాబోతున్నట్లు సమాచారం.  విజయకాంత్ కోలుకున్నారనే వార్తతో డీఎండీకే శ్రేణులు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: