టాప్ హీరోల సినిమాల బిజినెస్ కు ఆసినిమాకు పనిచేసే భారీ కాంబినేషన్ల బట్టి అత్యంత భారీగా జరుగుతుంది. అందుకే ప్రముఖ నిర్మాణ సంస్థలు మధ్యలో నష్టాలు వచ్చినా కొడితే జాక్ పాట్  కొట్టాలి అన్న ఆలోచనలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ తీస్తున్న నిర్మాత రాథా కృష్ణ హారికా హాసినీ నిర్మాణ సంస్థకు వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.
 టాక్ ఆఫ్ ది టాలీవుడ్
‘అజ్ఞాతవాసి’ భారీ పరాజయాన్ని లెక్క చేయకుండా ‘అరవింద సమేత వీరరాఘవ’ ను ఈమూవీ నిర్మాతలు ఎంత కోట్ చేస్తే అంతకు కొన్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఈమూవీ నాన్ థియేటర్ హక్కులు కూడా చాలా భారీ రేట్లకు అమ్మకం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ శాటిలైట్ హక్కులను 22 కోట్లకు కొనడానికి  జీటీవీ ముందుకు వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. 
ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్లు
అదేవిధంగా ఈమూవీ హిందీ డబ్బింగ్ రైట్స్సంబంధించి 22కోట్ల వరకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ద్వారా మరో అయిదు కోట్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఇలాఎలా చూసుకున్నా 50కోట్లు నాన్ థియేటర్ బిజినెస్ ఈసినిమా హిట్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా జరుగుతున్న నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి బయ్యర్లు ఇప్పటికే ఖారారు చేసిన ఈమూవీ ఏరియా రైట్స్ తో కలుపుకుంటే బిజినెస్ 130 కోట్ల స్తాయికి దాటిపోయి ఈమూవీ నిర్మాతలకు విడుదలకు ముందే 30 కోట్ల లాభం వచ్చే స్పష్ట మైన సంకేతాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు హడావిడి చేస్తున్నయి

 ఇండస్ట్రీలో ప్రకంపనలు

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈమూవీకి ఈస్థాయిలో బిజినెస్ అవుతూ ఉన్నా    అక్టోబరు 11నవిడుదల కాబోతున్న ఈ మూవీ బ్లాకు బస్టర్ హిట్ గా మారితేకాని ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు గట్టు ఎక్కారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ 200కోట్లు దాటితే కానీ ఈబయ్యర్లకు కనీస లాభాలు రావు. తెలుగు సినిమాలకు సంభందించి దసరా సీజన్ సంక్రాంతి సమ్మర్ సీజన్ తో పోల్చుకుంటే  చాలా చిన్నది. అయితే ఈవిషయాలు ఏమి పట్టించుకోకోకుండా  జరుగుతున్న బిజినెస్ ను చూస్తున్న వారు ‘అరవింద సమేత’ లెక్కలు తప్పాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: