స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహ భరితంగా జరుపు కుంటున్న ఈ సందర్భంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సామాన్య జైలు ఖైదీలా జైలు శిక్ష అనుభవించిన ఒకనాటి గ్లామర్ హీరో సి.హెచ్. నారాయణరావు గురించి చాలామందికి తెలియదు.  స్వాతంత్ర్యం రాక ముందు 1940 ప్రాంతంలోనే హీరోయిజాన్ని అపాధించుకున్న టాలీవుడ్ ప్రప్రధమ గ్లామర్ హీరో సి.హెచ్.  నారాయణరావు అన్న విషయం ఆనాటి వారికి తప్ప నేటి తరానికి తెలియని విషయం.

స్వతంత్రం రాకముందే తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సి.హెచ్.నారాయణరావు ఆరోజులలోనే హీరో అంటే ఎర్రగా, పొడుగుగా, నాజుకుగా, మ్యాన్లీగా నారాయణరావు లా ఉండాలి అన్న ట్రెండ్ ను క్రియేట్ చేసిన టాప్ హీరో.  ఆనాడే తాను నటించే సినిమాలకు ‘లక్ష’ రూపాయల పారితోషికం తీసుకున్న ఆనాటి టాప్ హీరోగా రికార్డు సృష్టించాడు.
Image result for క్విట్ ఇండియా
అటువంటి గ్లామర్ హీరో  1942  ప్రాంతంలో మహాత్మా గాంధీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’  ఉద్యమ పిలుపుకు ఆకర్షితుడై సినిమాలను కూడ వదులుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం.  ఆ రోజులలో యువతరం  నారాయణరావులా డ్రెస్ లు వేసుకోవాలి, ఆయనలా క్రాప్ చేయి౦చుకోవాలి అని ఫాలో అయ్యే నేపధ్యంలో విలాసవంతమైన సినిమా జీవితాన్ని వదులుకుని స్వాతంత్ర సమరంలో పాల్గొనడం అప్పట్లో హాట్ న్యూస్.

ఆయన నటించిన ‘మొదటి రాత్రి’ అన్న సినిమాలో లారీ క్లీనర్ గా వేషం వేసి అడ్డగళ్ళ చారల బనియన్ వేసుకుంటే ఆరోజుల్లోనే ఆ బనియన్ లకు ఇప్పటి క్రేజీ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల టీ-షర్ట్స్ కు వచ్చినంత క్రేజ్ వచ్చిందని ఆ తరం వారు చెపుతూ ఉంటారు.  ‘భక్త పోతన’ సినిమాలో ఆయన శ్రీరాముడిగా నటిస్తే ఆయన పోస్టర్లకు ఆరోజుల్లోనే ప్రేక్షకులు దండం పెట్టేవారట.

అటువంటి నారాయణరావు ఇచ్చిన స్పూర్తితో ఆయన అభిమానులు అనేక మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు అంటే నారాయణరావు పిలుపుకు ఆరోజులలో ఎంత విలువ ఇచ్చే వారో అర్ధం అవుతుంది. ఇప్పటి టాప్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ సిగరెట్ వెలిగించే మ్యానరిజం అప్పట్లోనే నారాయణరావు చేసిన విషయం ఎవరికీ తెలియని విషయం.

Image result for వి. నాగయ్య

నారాయణరావుతో పాటుగా ఆనాటి సినిమాల టాప్ హీరో చిత్తూరు వి. నాగయ్య కూడ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు.  ఆయన కూడ ఆరోజుల్లోనే మహాత్మాగాంధీ పిలుపును అందుకుని ఖద్దరు బట్టలు ధరించడమే కాకుండా ‘క్విట్ ఇండియా’ సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చాడు. ఆ తరువాత స్వాతంత్రం వచ్చాక టాప్ హీరోలుగా తెలుగు సినిమా రంగాన్ని ఏలిన అక్కినేని నాగేశ్వరరావు – నందమూరి తారక రామారావులు ఎన్నో దేశభక్తి సినిమాలలో నటించడమే కాకుండా వారు నటించే సినిమాలలో దేశభక్తి సంబంధించిన ఒక పాటను ఉండేలా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

అక్కినేని నందమూరిలు తాము జీవించి ఉన్నంత కాలం షూటింగ్ లేనప్పుడు ఖద్దరు పంచెలు మాత్రమే ధరించి సినిమా ఫంక్షలకు వచ్చేవారు అంటే ఆనాటి “జాతిపిత మహాత్మాగాంధీ” మాటలకు ఎంత విలువ ఇచ్చే వారో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: