వచ్చే సంవత్సరం రాబోతున్న ఎన్నికల వేడి ఫిలిం ఇండస్ట్రీకి కూడ తాకడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది నటులు మరియు ప్రముఖులు ఇప్పటి నుంచే రాబోతున్న ఎన్నికల విషయమై తాము అనుసరించబోయే వ్యూహాల పై కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన బాలకృష్ణ పవన్ లు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటూ ప్రస్తుత రాజకీయ వాతావారణాన్ని వేడెక్కిస్తున్నారు.
Haven’t decided on the director but will announce in a few days: Nandamuri Balakrishna about biopic of N.T. Rama Rao
ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేసాడు అని వస్తున్న వార్తల పై పవన్ అభిమానులు తీవ్రంగా మండి పడుతున్నారు. ఈమధ్య బాలకృష్ణ మీడియా వర్గాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ సభలకు ఎక్కువ సంఖ్యలో జనం వస్తున్న విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. 
Pawan Kalyan
అయితే ఈప్రస్తావనకు అసహనానికి లోనైన బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కు జనం ఎంతమంది వస్తున్నారు అన్న విషయం తనకు తెలియదని అయితే కొంతమంది అలగా జనం వచ్చే మీటింగ్స్ గురించి తాను పెద్దగా పట్టించుకొను అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు. బాలకృష్ణ మాటలు ఇలా మీడియాలో వచ్చిన వెంటనే ‘జనసేన’ పార్టీలోని కొందరు కీలక నాయకులు బాలకృష్ణ పై విరుచుకు పడుతూ కామెంట్స్ చేయడమే కాకుండా బాలకృష్ణ తన మాటలను సవరించుకోవాలి అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. 

అయితే ఈమధ్య కాలంలో తన పై ఎవరు విమర్శలు చేసినా మాటలతో విరుచుకు పడిపోతున్న పవన్ బాలకృష్ణ మాటలకు ఎటువంటి స్పందన ఇవ్వకుండా మౌనం వహించడం పవన్ అభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో కొందరు పవన్ వ్యతిరేకులు పవన్ కు బాలయ్య అంటే భయమా అంటూ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల సీజన్ క్లైమాక్స్ కు వచ్చిన తరువాత బాలయ్య పవన్ ల మధ్య మాటల వేడి పెరిగే అవకాసం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: