భారతదేశం స్వాతంత్రం పొందడానికి విప్లవ పోరాటం చేసినవారిలో అత్యంత ప్రముఖ స్థానంలో చంద్రశేఖర్ అజాద్ ఒకరు. చంద్రశేఖర్ సీతారాం తివారీగా పేరు ఉన్న ఈయన ఆతరువాత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ గా పిలవబడ్డారు. జూలై 23, 1906 బాదర్కా ప్రాంతంలో  ఉన్నాఒ జిల్లా ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. ఈయన భారతీయ ఉద్యమకారుడు స్వాతంత్య్ర సమర యోధులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఈయన ఒకరు.  చంద్రశేఖర్ అజాద్ హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా బ్రిటీష్ ప్రభుత్వానికి చిక్కకుండా విప్లవ ఉద్యమాన్ని నడిపించి తనకు తానే అమరావీరుడుగా ఆత్మాహుతి చేసుకున్న విప్లవ వీరుడు. ఇప్పటికీ భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు చంద్రశేఖర్ అజాద్.
Wahabi movement and Indian freedom struggle
వీరితో పాటు మరో విప్లవ వీరుడుగా ఫ్రీడం ఫైటర్ కుదిరమ్ బోస్ ను పేర్కొనాలి. బ్రిటీష్ ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా అప్పట్లో బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రమష్యసంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రానథ్ దత్, వి.డి సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్ కు కింగ్స్ ఫోర్డ్ పై హాత్యాప్రయత్నం చేసినందుకు మరణ శిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. 
British colonial rule
వీరితో పాటు ప్రధమ స్వాతంత్రోధ్యమానికి నాయకత్వం వహించిన మరాఠా రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ ప్రస్తావన లేకుండా మన స్వాతంత్రోద్యమ చరిత్ర పూర్తికాదు. భారత చరిత్రలో అత్యంత ప్రాచుర్యం మహిళా యోధులలో ఈమె ఒకరు. మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ‘ఝాన్సీ’ అనే రాజ్యానికి రాణిగా 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశం యొక్క ‘జాయన్ ఆఫ్ ఆర్క్’ లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. ఈమెతో కలిసి అలనాటి ఉద్యమాన్ని నడిపించిన మంగళ్ పాండే తాంతీయా తోపేల గురించి ప్రస్తావన లేకుండా భారత దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఉండదు. 

ఈవిప్లవ వీరుల చరిత్రలో ప్రత్యేకంగా అష్ఫాకుల్లా ఖాన్ గురంచి చెప్పుకోవాలి. కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈవిప్లవ కారుడు తన మాతృ భూమికి స్వాతంత్రం తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో అప్పటి భారతదేశ జనాభాలో 7 కోట్లమంది ముస్లీమ్ లను జాతీయ భక్తులుగా మార్చడానికి విప్లవ ఉద్యమాలు నిర్వహించి తాను ఉరి కంభం ఎక్కుతున్నందుకు ఆనంద పడుతూ తన ‘ఉరితాడును ముద్డాడి తన మెడలో తానే వేసుకున్న’ త్యాగమూర్తి. ‘నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతా లవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమత్యంతో ఆంగ్లేయుల ను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి’ అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ చెప్పిన మాటలు భారత జాతి జీవించినంత కాలం శాస్వితంగా నిలిచిపోతాయి. ఇలా ఎందరో విప్లవ యోధులు చిందించిన రక్తంతో వచ్చిన  మన స్వాతంత్ర విలువ తెలుసుకోవలసిన బాధ్యత మన యువతరానిది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: