తమిళ ఇండస్ట్రీ ప్రముఖ రచయిత,కవి, రాజకీయనాయకుడు కరుణానిధి కన్ను మూయడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.  కేవల రాజకీయలతో మాత్రమే కాకుండా సీనీ ప్రపంచాన్ని కూడా ఆయన శాసించారు.   ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జూపిటర్‌ పిక్చర్స్‌’ నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్‌ రైటర్‌గా కొత్త జీవితాన్ని కరుణానిధి ప్రారంభించారు. ఆయన 39 సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేశారు.  కరుణానిధి తొలిసారిగా 1947లో ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాశారు.
Image result for karunanidhi film industry
ఇది ఎంజీఆర్‌ ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా కావడం విశేషం. తర్వాత ‘అభిమన్యు’ చిత్రానికి కరుణానిధి మాటలు రాశారు. 1952లో వచ్చిన ‘పరాశక్తి’ సినిమాతో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా నటుడు శివాజీ గణేశన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘మనోహర‌’తో కరుణానిధి పేరు మార్మోగిపోయింది.  కరుణానిధికి తెలుగు ఇండస్ట్రీతో కూడా మంచి అనుబంధం ఉంది.  ఏదైనా సినిమా ఫంక్షన్ కు పిలిస్తే, తప్పకుండా హాజరయ్యేవారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా ఆయన అనుబంధం ఉంది.

రామానాయుడు నిర్మించిన 'ప్రేమనగర్' సినిమా శతదినోత్సవ వేడుకకు కరుణ హాజరై... నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. ఓ తెలుగు సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. తమిళంలో జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన 'వండిక్కారణ్ మగన్' చిత్రానికి తెలుగు అనువాదమే ఈ సినిమా. దాసరి దర్శకత్వం వహించిన 'నీడ' చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: