తెలుగు ఇండస్ట్రీలో పది సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించిన ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంతో సోషల్ మెసేజ్ తో పాటు మంచి మాస్ ఎలిమెంట్స్ కూడా చూపించారు.  ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత చిరంజీవి తన 151 వ చిత్రం సురేందర్ రెడ్డి తో అలనాటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబోతున్న ‘సైరా నరసింహారెడ్డి ’ చిత్రంలో నటిస్తున్నారు. 
Image result for saira narasimha reddy
ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.  ఈ చిత్రం పూర్తయిన తర్వాత చిరంజీవి హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నారు.  చిరంజీవి 152 వ చిత్రంలో హీరోయిన్ గా బొమ్మాళి అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తునాయి.  వాస్తవానికి ‘సైరా నరసింహారెడ్డి’లోనే ఛాన్స్ రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అనుష్క నటించలేక పోయింది. కొరటాలతో కలిసి చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో  రైతుగా కనిపించనున్నారట.
Image result for saira narasimha reddy
అందుకు సంబంధించిన పనుల్లో కొరటాల బిజీగా వున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో  క్రేజ్ పరంగా చూసినా .. జోడీ పరంగా చూసినా అనుష్క అయితేనే బాగుంటుందని భావించారు. అందువలన ఆమెను తీసుకోవడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైనట్టేనని అంటున్నారు .. అయితే అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించవలసి వుంది. డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: