బ్రిటీష్ వారి బానిన సంకెళ్లను తెంచి భరతమాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయకంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన  అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవితలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.  

భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్.  మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె  పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్ చంద్రభోస్ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. 
 Sarojini Naidu Birth Anniversary: Know All About 'Nightingale Of India'
ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో  గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్ అలీ స్వాతంత్రోద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేకమంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. 
Indira Gandhi
అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయపోరాట చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా  ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: